Budget 5.1 Soundbar: గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 300W సౌండ్ బార్ డీల్.!
Budget 5.1 Soundbar డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది
ఈ సౌండ్ బార్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది
చవక ధరలో 300W పవర్ ఫుల్ సౌండ్ అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్
Budget 5.1 Soundbar డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. చవక ధరలో 300W పవర్ ఫుల్ సౌండ్ అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూసే వారికి ఈ సౌండ్ బార్ తగిన డీల్ అవుతుంది. ఈ సౌండ్ బార్ అన్ని ఆఫర్స్ తో కలిపి 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Budget 5.1 Soundbar Deal
ఈ బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ వివరాల్లోకి వెళితే, జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ JUKE BAR 800 పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 రూపాయల చవక ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ SBI, Canara, మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 649 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,850 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
Also Read: Infinix GT 30 Pro 5G: OG గేమింగ్ ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!
ZEBRONICS Budget 5.1 Soundbar: ఫీచర్స్
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సపోర్ట్ మరియు కాంపాక్ట్ లుక్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగి 110W సౌండ్ అందించే బార్, రెండు 45W శాటిలైట్ స్పీకర్లు మరియు 100W RMS హెవీ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్ కనెక్ట్ సెటప్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ 45Hz-20kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తో వస్తుంది. ఇది 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అయితే, ఇందులో Dolby లేదా DTS వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లు మాత్రం ఉండదు. ఈ సౌండ్ బార్ ఆప్టికల్ ఇన్, HDMI (ARC), USB, AUX మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. వాల్యూమ్, మీడియా కంట్రోల్ బటన్స్ తో పాటు రిమోట్ ను కూడా కలిగి ఉంటుంది.