amazon prime day sale last day big deal on ZEBRONICS 7.2.4 Dolby Atmos soundbar
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఇండియాలో విడుదలైన ప్రీమియం సౌండ్ బార్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ 2025 సంవత్సరం మధ్య కాలంలో 44 వేల రూపాయల ప్రీమియం ధరలో లాంచ్ అయింది. అయితే, అమెజాన్ కొత్తగా ప్రకటించిన ప్రైమ్ డే సేల్ చివరి రోజు అయిన ఈ రోజు 13 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో 7.2.4 ఛానల్ సెటప్ కలిగిన ఏకైక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.
జెబ్రోనిక్స్ యొక్క Juke BAR 10000 సౌండ్ బార్ ను ను అమెజాన్ ఈరోజు డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రూ. 13,000 భారీ డిస్కౌంట్ తో రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డు తో కొనే వారికి 5% (రూ. 1,500) అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అమెజాన్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 30,499 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇది ఆల్ టైమ్ తక్కువ ధర అవుతుంది. Buy From Here
Also Read: Prime Day Sale చివరి రోజు LG మరియు Samsung 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు అతి చవక ధరలో లభిస్తున్నాయి.!
ఇది 1100 వాట్స్ RMS పవర్ తో వచ్చే ప్రీమియం 7.2.4 హోమ్ థియేటర్ సౌండ్ బార్. ఇది Dolby Atmos మరియు DTS టెక్నాలజీతో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్ మరియు గేమ్స్ ఈ సౌండ్ బార్ లో గొప్ప అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు, ఇందులో థియేటర్ స్థాయి సరౌండ్ సౌండ్ ని ఆస్వాదించవచ్చు. ఇక ఈ సౌండ్ బార్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో పైన, సైడ్ లో మరియు ఎదురు స్పీకర్లు కలిగి 520W అందించే సౌండ్ బార్, 300W వైర్ లెస్ డ్యూయల్ ఉఫర్ సబ్ వూఫర్, 280W డ్యూయల్ వైర్ లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి.
ఇందులో శక్తివంతమైన బాస్ తో పాటు స్పష్టమైన వోకల్స్ మీరు విప్ వినవచ్చు. డ్యూయల్ పాసివ్ రేడియేటర్స్ తో లోతైన బాస్ ను ఇది అందిస్తుంది. బ్లూటూత్ 5.3, HDMI eARC, ఆప్టికల్, USB మరియు AUX వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు ఇందులో ఉన్నాయి. ఇది టీవీ, మొబైల్, ల్యాప్ టాప్ వంటి అన్ని పరికరాలకు సులభంగా కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బీర్ తో వచ్చే వైర్ లెస్ UHF కరావోకే మైక్ తో పాటలు పాడుతూ మరింత ఎంజాయ్ చేయవచ్చు. LED డిస్‌ప్లే, టచ్ కంట్రోల్స్, CEC సపోర్ట్, వాల్ మౌంట్ డిజైన్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.