ఇంటిని థియేటర్‌ గా మార్చే Sony Dolby సౌండ్ బార్ పై అద్భుతమైన ఆఫర్.!

HIGHLIGHTS

Sony Dolby సౌండ్ బార్ పై అమెజాన్ అద్భుతమైన ఆఫర్ అందించింది

సోనీ యొక్క లేటెస్ట్ వైర్లెస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది

ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే డీప్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది

అమెజాన్ ఇండియా ఈరోజు ఇంటిని థియేటర్‌ గా మార్చే Sony Dolby సౌండ్ బార్ పై అద్భుతమైన ఆఫర్ అందించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ యొక్క లేటెస్ట్ వైర్లెస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే డీప్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్స్ కంప్లీట్ ఇన్ఫో తెలుసుకోండి.

Sony Dolby సౌండ్ బార్ : ఆఫర్స్

సోనీ యొక్క 2.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ HT-S400 మోడల్ పైన అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు రూ.18,990 ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తుంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ను HSBC Taj క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 14,990 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: POCO X8 మరియు X8 Power లాంచ్ డేట్ ఫిక్స్ .. మతిపోగొట్టే బ్యాటరీతో లాంచ్ కి రెడీ.!

Sony Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు కంప్లీట్ వైర్లెస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్‌ బార్‌ లోని వైర్‌లెస్ సబ్‌ వూఫర్ డీప్ మరియు రిచ్ బాస్‌ ను అందిస్తుంది. ముఖ్యంగా, వైర్లు లేకుండా మరియు ఎవరికీ కనిపించకుండా సబ్‌ ఉఫర్‌ ను మీ గదిలో అనుకూలమైన ప్రదేశంలో ఉంచుకోవచ్చు. యాక్షన్ సినిమాలు మరియు మ్యూజిక్ ఇందులో మరింత ఇంపాక్ట్‌ తో ఆస్వాదించవచ్చు.

ఈ సోనీ సౌండ్ బార్ లో ఉన్న S-Force PRO Front Surround Sound టెక్నాలజీ, వచ్చే సౌండ్‌ ను మరింత విశాలంగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి, అదనపు రియర్ స్పీకర్ల అవసరం లేకుండానే సినిమాలు మరియు టీవీ కంటెంట్‌ లో ఇమ్మర్సివ్ సరౌండ్ సౌండ్ అనుభూతిని మీరు పొందవచ్చు. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ కలిగిన డాల్బీ డిజిటల్ సౌండ్ సినిమా థియేటర్ స్థాయి ఫీల్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :