ప్రీమియం Dolby Atmos 5.2.4 సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Dolby Atmos 5.2.4 సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈ సౌండ్ బార్ ఎప్పుడు చూడనంత చౌక ధరల లభిస్తుంది

ఈ సౌండ్ బార్ డీల్ ను ఈ రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాను

ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన ఒక ప్రీమియం Dolby Atmos 5.2.4 సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈరోజు ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఎప్పుడు చూడనంత చౌక ధరల లభిస్తుంది. అందుకే, ఈ సౌండ్ బార్ డీల్ ను ఈ రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Dolby Atmos 5.2.4 సౌండ్ బార్ : ఆఫర్స్ ఫ్రంట్

అమెజాన్ నిన్నటి నుంచి ప్రారంభించిన జెబ్రోనిక్స్ బ్రాండ్ డేస్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. జెబ్రోనిక్స్ లేటెస్ట్ డాల్బీ అట్మోస్ 5.2.4 సౌండ్ బార్ సౌండ్ బార్ Juke BAR 9850 పై అమెజాన్ ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 75% భారీ డిస్కౌంట్ అందించి రూ. 18,999 రూపాయల ధరతో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ ఆప్షన్ పై రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,749 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరలో పొందాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.

Also Read: BSNL New Plan: మినిమమ్ ధరలో 70 రోజులు భారీ డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Dolby Atmos 5.2.4 సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది జెబ్రోనిక్స్ అందించిన ఒక శక్తివంతమైన 5.2.4 ఛానల్ సౌండ్‌ బార్ సిస్టమ్. ఇది ఇంట్లోనే థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందించేందుకు రూపొందించబడింది. ఈ సౌండ్ బార్ మొత్తం 725 వాట్స్ RMS అవుట్‌ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో స్పష్టమైన డైలాగ్‌లు, డైనమిక్ సౌండ్ ఎఫెక్ట్స్ మరియు లోతైన బాస్‌ ను ఆనందించవచ్చు.

ఈ సౌండ్‌ బార్‌ లో ఉన్న Dolby Atmos సపోర్ట్ తో సౌండ్ ఇంట్లో నలువైపుల నుంచి వస్తుంది. ఈ ఫీచర్ తో మీ ఇంట్లో 3D సరౌండ్ ఆడియో అనుభూతిని కలిగిస్తుంది. అదనంగా డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్స్ మరియు వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు ఉండటం వల్ల వైర్ల చిక్కులు లేకుండా గొప్ప సౌండ్‌ ను ఆస్వాదించవచ్చు.

కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ లో HDMI eARC, ఆప్టికల్, AUX, బ్లూటూత్ మరియు USB సపోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో ఉన్న వైర్లెస్ UHF మైక్రోఫోన్ ద్వారా కరాకే (Karaoke) ఫీచర్‌ ను కూడా వినియోగించుకోవచ్చు. అంటే, ఈ సౌండ్ బార్ సౌండ్ కోసం మాత్రమే కాదు మీ ఇంటి పార్టీ లో మైక్ సెట్ లాగా కూడా ఉపయోగపడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :