900W Dolby Soundbar అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

900W Dolby Soundbar పై అమెజాన్ ఇండియా భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది

ఈ సౌండ్ బార్ దివాళి స్పెషల్ సేల్ నుంచి కేవలం 12 వేల ఆఫర్ ధరలో లభిస్తుంది

ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది

900W Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ లేటెస్ట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి కేవలం 12 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ నుంచి ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

900W Dolby Soundbar ఆఫర్

Mivi లేటెస్ట్ గా విడుదల చేసిన Superbars Cinematic 900W ప్రీమియం డాల్బీ ఆడియో సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 81% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ. 1,399 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,600 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

900W Dolby Soundbar ఫీచర్స్

ఈ మివి సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఎదురు మూడు స్పీకర్ సెటప్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది మరియు 5.2 సరౌండ్ సెటప్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

ఈ మివి సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూవీ, మ్యూజిక్, న్యూస్ మరియు గేమ్ నాలుగు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX COAXIAL, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ కూడా అందించింది. అంటే, ఈ సౌండ్ బార్ కంప్లీట్ సౌండ్ సెటప్ తో పాటు కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: Lava Bold N1 Lite బిగ్ డీల్స్ మరియు ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!

ఈ జబర్దస్త్ సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ దార్లో లభిస్తుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :