WhatsApp AI Profile పిక్చర్ ఫీచర్ తెచ్చే పనిలో పడిన వాట్సాప్.!
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ తెచ్చే పనిలో పడింది
ఇప్పటికే చాలా ఉపయోగకరమైన ఫీచర్లను అందించిన వాట్సాప్
Whatsapp AI Profile పిక్చర్ ఫీచర్ ను తీసుకువస్తోంది
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ తెచ్చే పనిలో పడింది. యూజర్లకు ఇప్పటికే చాలా ఉపయోగకరమైన ఫీచర్లను అందించిన వాట్సాప్, ఇప్పుడు WhatsApp AI Profile పిక్చర్ ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ అనుభూతిని మరింత పెరుగుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉంది.
WhatsApp AI Profile Picture
వాట్సాప్ AI ప్రొఫైల్ పిక్చర్ క్రియేషన్ కోసం AI Profile Photo ఫీచర్ ను అందించే పనిలో వాట్సాప్ ఉన్నట్లు WABetainfo తెలిపింది. ఈ ఫీచర్ తో యూజర్లు వారి ప్రొఫైల్ పిక్చర్ ను AI ద్వారా ఎన్ హెన్స్ చేసుకునే అవకాశం ఉంటుందని ఈ రిపోర్ట్ తెలిపింది.
📝 WhatsApp beta for Android 2.24.11.17: what's new?
— WABetaInfo (@WABetaInfo) May 22, 2024
WhatsApp is working on a feature to generate AI-powered profile photos, and it will be available in a future update!https://t.co/Chig5TiyQR pic.twitter.com/l44qbZX18A
ఈ అప్ కమింగ్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉందని, అప్ కమింగ్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుతుందని కూడా ఈ నివేదిక తెలియచేసింది. అంతేకాదు, ఇది ఇంకా బీటా టెస్టర్స్ కోసం కూడా అందుబాటులోకి రాలేదని కూడా తెలిపింది.
Also Read: Vivo X Fold 3 Pro లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!
ముందుగా బీటా టెస్టర్స్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చిన క్రియేట్ అండ్ షేర్ AI Stickers ఫీచర్ కొనసాగింపుగా ఈ కొత్త ఫీచర్ గా వస్తోంది. ముందుగా వచ్చిన ఈ ఫీచర్ ద్వారా AI స్టిక్కర్ లను క్రియేట్ చేసి షేర్ చేసే వీలుంది. అయితే, రానున్న అప్ కమింగ్ ఫీచర్ ద్వారా ప్రొఫైల్ పిక్చర్ ను క్రియేట్ చేసుకునే వీలుంటుంది.
ఈ ఫీచర్ ఎలా ఉంటుందో తెలియజేసే స్క్రీన్ షాట్ ను కూడా వాబీటాఇన్ఫో షేర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ద్వారా ఈ ఫీచర్ ఎలా ఉంటుందో తెలియ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ను క్రింద చూడవచ్చు.
ఈ స్క్రీన్ షాట్ ద్వారా, యూజర్ కు నచ్చిన విధంగా ప్రాంప్ట్ లేదా గుర్తులు అందించడం ద్వారా యూనిక్ AI ప్రొఫైల్ పిక్చర్ ను నేరుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ తన నిజమైన ఫోటోలు షేర్ చేయకుండా ఈ AI ఇమేజ్ లను ప్రొఫైల్ ఫోటోలుగా ఎంచుకోవచ్చు. తద్వారా, యూజర్ ప్రైవసీ మరింత పటిష్టం అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది.
ఈ అప్ కమింగ్ ఫీచర్ అప్ వాట్సాప్ అప్డేట్స్ ద్వారా అందుకునే అవకాశం ఉండవచ్చు, అని కూడా తెలిపింది.
Tags: tech news