Rapido App Down: రాపిడో యాప్ పనిచేయక యూజర్ల అతలాకుతలం.!
Rapido App Down అయినట్లు యూజర్ల కంప్లైంట్స్
సరైన రీతిలో పని చేయడం లేదని వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ అందుకుంది
App సర్వీస్ లో వచ్చిన సమస్య కారణంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు
Rapido App Down: బైక్ ట్యాక్సీ సర్వీసెస్ లో ప్రసిద్ధ అప్లికేషన్ గా పేరొందిన రాపిడో గత కొన్ని రోజులుగా సరైన రీతిలో పని చేయడం లేదని వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ అందుకుంది. అయితే, ఈ యాప్ ఈ రోజు పూర్తిగా అటకెక్కింది. ఈ యాప్ లో రైడ్స్ తో పాటు పార్సిల్ సర్వీస్ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. రాపిడో ద్వారా బైక్ రైడ్ బుక్ చేసి వేగంగా ప్రయాణించడం కోసం ప్లాన్ చేసే యూజర్లు, ఈరోజు ఈ సర్వీస్ లో వచ్చిన సమస్య కారణంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
SurveyRapido App Down
రాపిడో రైడ్ మరియు పార్సిల్ సర్వీస్ కోసం ఈరోజు ఢిల్లీలో యూజర్లు దారుణమైన అసౌకర్యానికి గురయ్యారు. పూర్తిగా యాప్ నిలిచి పోవడం తో రైడ్స్ కోసం లొకేషన్ లో యూజర్లు ఎదురు చూసి వేసారినట్లు చెబుతున్నారు. మేము ఈ సర్వీస్ గురించి చెక్ చేసిన సమయంలో యూజర్లు చెప్పినట్లు ఈ సర్వీస్ లో లోపం ఉన్నట్లు మేమియు గుర్తించాము.

కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు హైదరాబాద్ వంటి చాలా మేజర్ సిటీస్ లో ఈ ఈ యాప్ సర్వీస్ సరిగ్గా పనిచేయక యూజర్లు అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు. వాస్తవానికి, ఈ బైక్ ట్యాక్సీ సర్వీసెస్ యాప్ లోనే అతిపెద్ద లోపం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 :30 గంటల తర్వాత నుంచి ఈ యాప్ లో సమస్యలు చూసినట్లు యూజర్లు చెబుతున్నారు. అంతేకాదు, ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ X నుంచి యూజర్లు వారు ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తూ ట్వీట్ చేసారు.
Also Read: Realme GT 7 పై రియల్‌మీ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ముఖ్యంగా, రాపిడో కొత్తగా తెచ్చిన పార్సిల్ సర్వీస్ తో యూజర్లకు బాగా ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, యూజర్ బుక్ చేసిన పార్సిల్ ను తీసుకొని డ్రాప్ లొకేషన్ వెళ్ళే మార్గం మధ్యలో ఉండగా యాప్ పని చేయక పోవడంతో అటు దారి తెలియక రైడర్, ఇటు సమయానికి పార్సిల్ రాక యూజర్, ఇద్దరూ ఇబ్బంది పడినట్లు చాలా మంది చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే, చేసుకున్న రైడ్ లేదా పార్సిల్ లోకేషన్ లో తప్పులు మరియు క్యాన్సిలేషన్ కోసం ఆప్షన్ సరిగ్గా పని చేయకపోవడంతో యూజర్లు తిప్పలు పడినట్లు కూడా చెబుతున్నారు. యాప్ రెండు మూడు గంటల పాటు నిలిచిపోవడంతో రైడర్స్ సైతం ఎక్కడి వారు అక్కడే రోడ్ల పై నిలిచి పడిగాపులు గాచినట్లు వాపోతున్నారు.
ఈ యాప్ లో వచ్చిన సమస్య గురించి ఎవరితో కంప్లైంట్ చేయాలో తెలియకపోవడం మరియు కస్టమర్ కేర్ కోసం ఎటువంటి ప్రత్యేకమైన నెంబర్ లేకపోవడం కూడా మరో పెద్ద ఇబ్బందిగా తెలిపారు.