మీ ఫోనులో అనుకోకుండా ఫోటోలు డిలీట్ అయ్యాయా/చేశారా? ఈ ఆప్లతో కచ్చితంగా తిరిగి పొందవచ్చు.

HIGHLIGHTS

మీకు సహాయపడే Apps పేర్లు మరియు ఫీచర్లను తెలుసుకోండి.

మీ ఫోనులో అనుకోకుండా ఫోటోలు డిలీట్ అయ్యాయా/చేశారా? ఈ ఆప్లతో కచ్చితంగా తిరిగి పొందవచ్చు.

అనుకోకుండా మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి ఏదైనా ఫోటోను డిలీట్ చేసారా? అయినాకూడా మీరు ఆందోళన చెందే లేదా భయపడనవసరం లేదు. నిజానికి అనేక సార్లు వినియోగదారులు అనుకోకుండా కొన్ని ఫోటోలను తొలగించండం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. అటువంటి సమయంలో మీకు ఉత్తమ సహాయాన్ని అందించే 3 ఆప్లను తీసుకువచ్చాము. మీకు సహాయపడే Apps పేర్లు మరియు ఫీచర్లను తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

DiskDigger Photo Recovery

ఈ App దాదాపుగా 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అలాగే, ఇది Google Play స్టోర్లో 4.2 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 2 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు ఈ App యొక్క పరిమాణం మీ పరికరాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆప్ తో, డిలీట్ అయిన ఫోటోలను మళ్ళీ ఫోటోలను అన్ డిలేట్ మరియు రికవరీ చేస్తుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ చాలా సులభం. ఇది ఉపయోగించడానికి సులభం.ఎటువంటి రూట్ చేయాల్సిన పనిలేదు. 

Deleted Photo Recovery

మీరు Google Play Store లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్, 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్లో 4.3 స్టార్స్ కలిగివుంది. ఇది 66,000 వినియోగదారులచే రేట్ చేయబడింది. ఈ అప్లికేషన్ చాలా ఫోటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది.మీ ఫోనులో లేదా మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫోటోలను, త్వరగా తిరిగి తీసుకొస్తుంది. 

Restore Image (Super Easy)

ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారులచేత  డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా, Google Play Store లో 4.0 స్టార్లను సొంతంచేసుకుంది. ఇది 65,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 3MB గా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్ను root చేయాల్సిన అవసరం లేదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo