మీ ఫోన్ లోఇంపార్టెంట్ ఫోటోలు డిలీట్ అయ్యాయా? అయితే, ఈ యాప్స్ ట్రై చేయండి..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 12 Oct 2021
HIGHLIGHTS
  • ఫోటోలను అనుకోకుండా డిలీట్ చేశానని బాధపడుతున్నారా?

  • డిలీట్ చేసిన ఫోటోలను కూడా తిరిగి తీసుకొచ్చే యాప్స్

  • మంచి ఫలితాలను అందించే బెస్ట్ యాప్స్

మీ ఫోన్ లోఇంపార్టెంట్ ఫోటోలు డిలీట్ అయ్యాయా? అయితే, ఈ యాప్స్ ట్రై చేయండి..!
మీ ఫోన్ లోఇంపార్టెంట్ ఫోటోలు డిలీట్ అయ్యాయా? అయితే, ఈ యాప్స్ ట్రై చేయండి..!

మీ స్మార్ట్ ఫోన్ నుండి ఇంపార్టెంట్ ఫోటోలను అనుకోకుండా డిలీట్ చేశానని బాధపడుతున్నారా? అనుకోకుండా ఇలాంటి పనులు ఏదోఒకసారి మీ జీవితంలో జరిగే ఉంటుంది. అయితే, డిలీట్ చేసిన ఫోటోలను కూడా తిరిగి తీసుకొచ్చే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ చాలానే ఉన్నాయి. అయితే, మంచి ఫలితాలను అందించే కొన్ని బెస్ట్ యాప్స్ గురించి ఈరోజు మనం మనం తెలుసుకుందాం . డిలీట్ అయిన ఫోటోలను సులభముగా రీ ఇన్స్టాల్ చేసే ఒక 3 బెస్ట్ Apps గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ 3 Apps పేర్లు మరియు ఫీచర్లను ఈ క్రింద తెలుసుకోండి.

Deleted Photo Recovery

మీరు Google Play Store లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్, 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్లో 4.0 స్టార్స్ కలిగివుంది. ఇది 10 మిలియన్ డౌన్ లోడ్స్ సాధించింది. ఈ అప్లికేషన్ చాలా ఫోటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది.మీ ఫోనులో లేదా మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫోటోలను, త్వరగా తిరిగి తీసుకొస్తుంది.

DiskDigger Photo Recovery

ఈ App కూడా  10 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అలాగే, ఇది Google Play స్టోర్లో 4.0 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 2 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు ఈ App యొక్క పరిమాణం మీ పరికరాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆప్ తో, డిలీట్ అయిన ఫోటోలను మళ్ళీ ఫోటోలను అన్ డిలేట్ మరియు రికవరీ చేస్తుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ చాలా సులభం. ఇది ఉపయోగించడానికి సులభం.ఎటువంటి రూట్ చేయాల్సిన పనిలేదు.

Restore Image (Super Easy)

ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారుల కంటే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించింది. అంతేకాకుండా, Google Play Store లో 4.0 స్టార్లను సొంతంచేసుకుంది. ఇది 65,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 3MB గా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్ను root చేయాల్సిన అవసరం లేదు.      

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: best apps to recover deleted photos in mobile phone
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status