జియో నెంబర్ పైన మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చేయడం ఎలా?

జియో నెంబర్ పైన మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చేయడం ఎలా?
HIGHLIGHTS

మీరు జియో పైన మిస్డ్ కాల్ అలర్ట్ రావడం లేదా

మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివ్ గా ఉందొ లేదో తెలుసుకోవాలా

మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చేయాలా

మీరు మీ జియో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మీ ఫోనుకు వచ్చే కాల్ లను అందుకోలేక పోతున్నారా? మీరు మీ జియో మొబైల్ నంబర్ పైన మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చెయ్యడం ద్వారా మీ ఫోన్ కవరేజ్ ఏరియాలో లేనప్పుడు లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మీకు కాల్ చేసిన వారి మొబైల్ నంబర్ ను SMS రూపంలో పొందే వీలుంటుంది. మీ జియో నంబర్ పైన మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చేయడం ఎలా? అని చూస్తున్నట్లయితే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది.

రిలయన్స్ జియో యొక్క మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ జియో నంబర్లకు వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్ గురించి మెసేజ్ లను పంపుతుంది. మీ Jio మొబైల్ నంబర్‌లో మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ ను ఎలా యాక్టివేట్ చేయవచ్చో ఈ రోజు మేము మీకు తెలియజేస్తాము.

జియో మిస్డ్ కాల్ సర్వీస్ అంటే ఏమిటి?

మీ జియో మొబైల్ నంబర్ కవరేజ్ ప్రాంతంలో లేకున్నా లేదా ఆ నంబర్ కలిగిన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగినప్పుడు, మీ ఫోన్ కవరేజ్ ఏరియాలోకి వచ్చిన తరువాత లేదా స్విచ్ ఆన్ చేయబడితే రిలయన్స్ జియో మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ వినియోగదారులకు SMS  ద్వారా మీరు మిస్ అయిన కాల్స్ వివరాలను తెలియజేస్తుంది. ఈ సర్వీస్ అంతర్జాతీయ లేదా జాతీయ రోమింగ్‌లో కూడా పనిచేస్తుంది.   

Jio చందాదారులకు మిస్డ్ కాల్ సేవ ఉచితమా?

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, జియో మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ జియో చందాదారులకు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ కోసం జియో టెలికాం సంస్థ ఎటువంటి ఫీజ్ వసూలు చేయదు. మీ నంబర్‌ పైన ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ఎటువంటి USSD కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.

మీ ఫోన్ లో మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ ఎలా యాక్టివేట్ చేయాలి?

మీ ఫోన్ లో మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చెయ్యడానికి ఎటువంటి తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు. మీ జియో సిమ్‌తో ఈ   ఫీచర్ ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది మరియు దీనికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

మీ ఫీచర్ మీ ఫోన్ లో పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి మీ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి మరొక ఫోన్ నుండి మీ jio నంబరుకు కాల్ చేయండి. మీ జియో నంబర్ కలిగిన ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే మెసేజ్ ద్వారా మీరు మీకు మిస్డ్ కాల్ వివరాలు అందినట్లయితే మీ జియో నంబర్ పైన మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ యాక్టివా గా ఉందని అర్ధం. ఒకవేళ ఆలా కాకపొతే మీ నంబర్ పైన ఈ సర్వీస్  నిలిపివేయబడిందని అర్ధం. ఈ క్రింది తెలిపిన విధంగా యాక్టివ్ చేసుకోవచ్చు.

మొదట మీ జియో సిమ్‌లో రీఛార్జ్ ఉందా మరియు అది యాక్టివ్‌గా ఉందో లేదో తనిఖీ చేయండి

మీ ఫోన్ లో కాల్ ఫార్వార్డ్ యాక్సెస్ ఉన్నట్లయితే మీకు మిస్డ్ కాల్ అలర్ట్ మెసేజ్ రాదు. కాబట్టి కాల్ ఫార్వార్డ్ ఫీచర్ ను వెంటనే నిలిపి వేయండి. మీరు మీ ఫోన్ లో కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్ ను నిలిపివేయడానికి Jio SIM నుండి * 413 నంబరు కు డయల్ చేయండి. ఇలా చేసిన తరువాత మీరు మీ జియో నంబర్ పైన మిస్డ్ కాల్ అలర్ట్ మెసేజ్ లను అందుకుంటారు.

ఒకవేళ అప్పటికి ఈ సర్వీస్ యాక్టివేట్ కాకపోయినట్లయితే జియో కస్టమర్ కేర్ కు కాల్ చేయడం ద్వారా  మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీస్ ను పొందవచ్చు. దీనికోసం Jio SIM నుండి 198 నంబర్ కు కాల్ చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో సంప్రదించ వలసి ఉంటుంది.           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo