ఈ 10 సెట్టింగ్స్ తో మీ 5G Smartphone లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు.!

HIGHLIGHTS

ప్రస్తుతం చాలామంది 5G స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే

కొందరికి ఆశించిన స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్ వారి ఫోన్ లో కనిపించదు

మీ 5G స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ పెర్ఫార్మెన్స్ మెరుగుపరచుకోవడానికి ఈ చిట్కాలు ప్రయత్నించండి.

ఈ 10 సెట్టింగ్స్ తో మీ 5G Smartphone లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు.!

ప్రస్తుతం చాలామంది 5G స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరికి ఆశించిన స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్ వారి ఫోన్ లో కనిపించదు. వారు వాడేది 5G ఫోన్ మరియు 5G సిమ్ అయినా కూడా వీడియోలు బఫరింగ్ కావడం, ఫైల్స్ డౌన్‌ లోడ్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం మారియు వెబ్‌ సైట్లు నెమ్మదిగా ఓపెన్ అవడం వంటి సమస్యలు చూస్తుంటారు. అయితే, దీనికి ప్రతిసారీ టెలికాం నెట్‌ వర్క్ మాత్రమే కారణం కాదని తెలుసుకోండి. మీ ఫోన్ సెట్టింగ్స్, సిగ్నల్ బలం, నెట్‌ వర్క్ రద్దీ మరియు డేటా పరిమితులు కూడా ఇంటర్నెట్ వేగాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే, మీ 5G స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ పెర్ఫార్మెన్స్ మెరుగుపరచుకోవడానికి ఈ చిట్కాలు ప్రయత్నించండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5G Smartphone లో ఇంటర్నెట్ స్పీడ్ కోసం 10 చిట్కాలు

5G ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నించ దగిన 10 చిట్కాలు ప్రయత్నిద్దాం. వీటి గురించి వివరంగా ఈరోజు చూద్దాం.

5G నెట్‌ వర్క్ ఆన్ చేయండి

ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి మొబైల్ నెట్ వర్క్ లేదా SIM సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇందులో Preferred Network Type లో 5G/4G/3G/2G Auto ఆప్షన్‌ ను ఎంచుకోండి

సరైన ప్రాంతంలో ఫోన్ ఉపయోగించండి

ఇంటి లోపల సిగ్నల్ బలహీనంగా ఉంటే కిటికీ దగ్గర లేదా ఓపెన్ ప్రదేశంలో ఇంటర్నెట్ ఉపయోగించి చూడండి. మీకు వేగవంతమైన డేటా అవసరం ఉన్న సమయంలో ఈ చిట్కా మీకు బాగా ఉపయోగపడుతుంది.

ఎయిర్‌ ప్లేన్ మోడ్

మీ ఫోన్ లో నెట్ వర్క్ బాగా ఉన్నా కూడా ఇంటర్నెట్ అనుకున్న వేగంతో లేకపోతే మీ ఫోన్ లో ఉన్న Airplane Mode కొన్ని సెకన్ల పాటు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేయండి. దీంతో ఫోన్ నెట్‌ వర్క్‌ కు తిరిగి కనెక్ట్ అవుతుంది. మీ ఫోన్ లో ఇంటర్నెట్ వేగం పెరిగే ఛాన్స్ ఉంటుంది.

5G Smartphone

ఫోన్ రీస్టార్ట్ చేయండి

మీ స్మార్ట్ ఫోన్ ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా తాత్కాలిక నెట్‌ వర్క్ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇది ఫోన్ పూర్తిగా రిఫ్రెష్ చేస్తుంది కాబట్టి మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ కూడా బంద్ అవుతాయి.

బ్యాక్‌ గ్రౌండ్ యాప్స్ మూసివేయండి

అవసరం లేని యాప్స్ డేటాను ఉపయోగిస్తుంటే వాటి బ్యాక్‌ గ్రౌండ్ డేటాను పరిమితం చేయండి. ఇది మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచడంలో సహాయం చేస్తుంది.

డేటా సేవర్ ఆఫ్ చేయండి

Data Saver లేదా Low Data Mode ఆన్‌ చేసి ఉంచండి. ఇలా చేయడం వలన కొన్ని యాప్స్ పనితీరు పరిమితం కావచ్చు. ఇది కూడా మీ ఫోన్ ఇంటర్నెట్ వేగం పెంచడానికి సహాయం చేస్తుంది.

ఫోన్ సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్ చేయండి

అందుబాటులో ఉన్న అధికారిక సాఫ్ట్‌ వేర్, నెట్‌ వర్క్ అప్‌ డేట్ లను ఇన్‌ స్టాల్ చేయండి. కొత్త అప్డేట్స్ తో ఫోన్ వేగంగా ఉంటుంది మరియు యాప్స్ ని కూడా స్మూత్ గా రన్ చేస్తుంది. కాబట్టి, ఫోన్ లో ఇంటర్నెట్ వేగం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read: లేటెస్ట్ 55 ఇంచ్ Mini LED Smart Tv ని కేవలం సాధారణ టీవీ ధరకే అందుకోండి.!

సరైన APN సెట్టింగ్స్ ఉపయోగించండి

మీ టెలికాం ఆపరేటర్ సూచించిన APN వివరాలనే ఉపయోగించండి. తెలియని APN సెట్టింగ్స్ మార్చకండి. ఇది మీ ఫోన్ ఇంటర్నెట్ ని చేయకుండా చేసే అవకాశం ఉంటుంది.
SIM కార్డును చెక్ చేయండి

మీ సిమ్ 5G సేవలకు అనుకూలంగా ఉందో లేదో చెక్ చేయండి మరియు మీ ప్లాన్‌లో 5G ప్రయోజనాలు ఉన్నాయో లేవో చెక్ చేయండి.

నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేయండి

పైన పద్ధతులతో సమస్య పరిష్కారం దొరక్కపోతే, ఫోన్ లో Reset Network Settings ప్రయత్నించవచ్చు. అయితే, సేవ్ చేసిన Wi-Fi పాస్‌ వర్డ్‌ మరియు బ్లూటూత్ కనెక్షన్లు తొలగిపోవచ్చు. కాబట్టి, ఒకసారి మీ Wi-Fi పాస్‌ వర్డ్‌ చెక్ చేసి గుర్తు పెట్టుకుని తిరిగి లాగిన్ చేయండి.

ఒకవేళ మీ ఫోన్ ఈ సెట్టింగ్స్ మార్చినా కూడా ఇంటర్నెట్ వేగం పెరగకపోతే, మీ ప్రాంతంలో టెలికాం నెట్‌వర్క్ రద్దీ లేదా కవరేజ్ సమస్య ఉండవచ్చు. వేర్వేరు సమయాల్లో స్పీడ్ టెస్ట్ చేసి చూడండి. అవసరమైతే మీ నెట్‌ వర్క్ ఆపరేటర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile