మీ Aadhaar Deactivate అయితే ఏమవుతుంది.. తిరిగి Active ఎలా చేయాలి.!
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్
కొన్ని సందర్భాల్లో Aadhaar Deactivate లేదా Inactive అవుతుంది
బ్యాంక్ అకౌంట్ మొదలుకొని SIM కార్డు వరకు దాదాపు అన్ని సేవకు ఆధార్ కార్డ్ అవసరం అవుతుంది
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ మొదలుకొని SIM కార్డు వరకు దాదాపు అన్ని సేవకు ఆధార్ కార్డ్ అవసరం అవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో Aadhaar Deactivate లేదా Inactive అవుతుంది. అటువంటి సందర్భాల్లో అనేక సేవలు ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆధార్ ను మళ్లీ ఎలా Active చేసుకోవాలి? అని ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
SurveyAadhaar Deactivate అంటే ఏమిటి?
UIDAI మీ ఆధార్ నంబర్ ను తాత్కాలికంగా లేదా పూర్తిగా పని చేయకుండా నిలిపివేయడాన్ని ఆధార్ డీ యాక్టివేషన్ అంటారు. ఇలా జరిగితే, OTP రావడం ఆగిపోవచ్చు మరియు eKYC కూడా పనిచేయదు. అంతేకాదు, మీ బ్యాంక్ బ్యాంక్ వెరిఫికేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. మీ పాన్ లింక్ కోసం కూడా సమస్య తలెత్తుతుంది.
ఆధార్ డీ యాక్టివేట్ ఎందుకు అవుతుంది?
కొన్ని ఆధార్ నంబర్ ఎక్కువ కాలం ఉపయోగించకపోవడం వలన ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఆధార్ కార్డు లో డాక్యుమెంట్స్ అప్డేట్ చేయకపోవడం వలన ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. UIDAI కొన్ని సందర్భాల్లో కొత్త డాక్యుమెంట్స్ అప్డేట్ చేయమని అడుగుతుంది.
సమయానికి నూతన వివరాలు అప్డేట్ చేయకపోతే సమస్యలు రావచ్చు. ఒకే వ్యక్తికి అనేక ఆధార్ కార్డ్ ఉన్నట్లు అనుమానం వస్తే UIDAI ఆ వ్యక్తి ఆధార్ కార్డు ను Deactivate చేయవచ్చు.
ఆధార్ డీ యాక్టివేట్ అయితే ఏమవుతుంది?
మీ ఆధార్ డీ యాక్టివేట్ అయితే అన్నింటికన్నా ముందుగా మీ బ్యాంకు సేవలు ఆగిపోవచ్చు. ఎందుకంటే, మీ బ్యాంక్ అకౌంట్ తో అందించిన ఆధార్ KYC ఫెయిల్ అవుతుంది. కొత్త SIM తీసుకోవడం లేదా రీ వెరిఫికేషన్ లో ఇబ్బంది రావచ్చు. అతి ప్రధానమైన సమస్య మీకు లభించే ప్రభుత్వ పథకాల లాభాలు ఆగిపోవచ్చు. అంటే, PM కిసాన్, పెన్షన్ మరియు సబ్సిడీ పథకాలు నిలిచి పోతాయి. అంతేకాదు పాన్ మరియు ఆధార్ లింక్ సమస్య కూడా ఉంటుంది.
మీ ఆధార్ యాక్టివ్ గా ఉందో లేదో ఎలా చెక్ చేయాలి?
మీ ఆధార్ కార్డు యాక్టివ్ గా ఉందో లేదో UIDAI వెబ్సైట్ ద్వారా సులభంగా చెక్ చేయవచ్చు. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత “వెరిఫై ఆధార్ నెంబర్” ఎంచుకోండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ వివరాలు అందించిన తర్వాత చేయండి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఈ వివరాలు అందించిన తర్వాత మీ ఆధార్ యాక్టివ్ గా ఉందో లేదో తెలుస్తుంది. అంతేకాదు, మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో కూడా తెలుస్తుంది.

ఎలా Recover చేసుకోవాలి?
ఆధార్ యాక్టివేట్ చేయడానికి మీరు ఆధార్ సెంటర్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఇది అత్యంత సులభమైన మార్గం అవుతుంది. మీరు ఆధార్ సెంటర్ కి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
- ఆధార్ కాపీ copy
- పాన్ / ఓటర్ ఐడి
- అడ్రస్ ప్రూఫ్
- మొబైల్ నెంబర్
ఈ డాక్యుమెంట్స్ మరియు వివరాలు మీరు ఆధార్ సెంటర్ లో సబ్ మీట్ చెయాలి.
బయోమెట్రిక్ అప్‌డేట్ చేయండి
పిల్లలు లేదా చాలా కాలంగా ఆధార్ లో ఎటువంటి వివరాలు అప్డేట్ చేయకుండా ఉంటే బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి రావచ్చు.
డాక్యుమెంట్ అప్డేట్ చేయండి
మీ ఆధార్ అడ్రస్, ఫోటో మరియు ఐడెంటిటీ ప్రూఫ్ వంటివి కొత్త వివరాలు అందించి ఆధార్ ను అప్డేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా చేయడం ఆధార్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి కేవలం రూ. 5,999 ఆఫర్ ధరలో.. ఎక్కడంటే.!
కొత్త అప్డేట్ కోసం ఎంత ఖర్చు అవుతుంది?
ఆధార్ డెమోగ్రాఫిక్ అప్డేట్ కోసం రూ. 50 ఖర్చు అవుతుంది. అయితే, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ. 100 ఖర్చు అవుతుంది. ఇది UIDAI రూల్స్ ఆధారంగా మారవచ్చని గుర్తుంచుకోండి.
రికవరీ కోసం ఎంత టైమ్ పడుతుంది?
సాధారణంగా రికవరీ కోసం 7 నుంచి 30 రోజులు సమయం పెట్టె అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో త్వరగా కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఏదైనా కారణం చేత ఆధార్ డీ యాక్టివేట్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. సరైన డాక్యుమెంట్స్ తో UIDAI ఆధార్ సెంటర్ కి వెళ్తే మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile