ఆన్‌లైన్‌ లో మీ వ్యక్తిగత Privacy ని ఎలా కాపాడుకోవాలి : పూర్తి గైడ్

HIGHLIGHTS

నేటి డిజిటల్ యుగంలో మన రోజువారీ జీవితంలో చాలా భాగం ఆన్‌ లైన్‌ లోనే గడుస్తోంది

అందుకే ఆన్‌లైన్‌ దొంగతనం వంటి అనేక ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి

వ్యక్తిగత Privacy కాపాడుకోవడం చాలా ముఖ్యమైన మరియు అవసరమైన విషయం

ఆన్‌లైన్‌ లో మీ వ్యక్తిగత Privacy ని ఎలా కాపాడుకోవాలి : పూర్తి గైడ్

నేటి డిజిటల్ యుగంలో మన రోజువారీ జీవితంలో చాలా భాగం ఆన్‌ లైన్‌ లోనే గడుస్తోంది. బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా, ఉద్యోగం మరియు ఎడ్యుకేషన్ వంటి అనేక కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌ ను ఉపయోగిస్తున్నాం. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరాలు, డేటా చోరీ, ఫిషింగ్ దాడులు, ఐడెంటిటీ దొంగతనం వంటి అనేక ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే, ఆన్‌ లైన్‌ లో వ్యక్తిగత Privacy ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన మరియు అవసరమైన విషయంగా మారింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీ వ్యక్తిగత Privacy ని ఎలా కాపాడుకోవాలి?

ఆన్లైన్ లో మీ వ్యక్తిగత ప్రైవసీని సురక్షితం చేయడానికి మీరు కొన్ని సూత్రాలు పాటించాలి. ఇందులో మీ అకౌంట్ లకు బలమైన పాస్‌ వర్డ్‌ లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) మరియు బ్యాంక్ మరియు ఈమెయిల్ ఖాతాలను తరచుగా పరిశీలించడం వంటి మరిన్ని టిప్స్ తీసుకుని మీ మీ వ్యక్తిగత ప్రైవసీ ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

బలమైన పాస్‌ వర్డ్‌ లను ఉపయోగించండి

ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌ వర్డ్‌ లను ఉపయోగించండి. అంతేకాదు, ఈ పాస్‌ వర్డ్‌ లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక గుర్తులు కలిపి కనీసం 12 అక్షరాల పొడవు ఉండాలి. సులభంగా ఊహించగల సమాచారాన్ని పాస్‌ వర్డ్‌ గా పెట్టవద్దు. అంటే, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్ లేదా 1234 వంటి ఈజీగా పాస్ వర్డ్ పెట్టొద్దు.

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేయండి

మీ బలమైన పాస్‌ వర్డ్‌ తో పాటు ఓటీపీ లేదా ఆ థెంటికేటర్ యాప్ ద్వారా రెండో స్థాయి భద్రతను అందించే 2FA ను అన్ని ముఖ్యమైన ఖాతాల్లో ఆన్ చేయండి. ఇలా చేస్తే మీ పాస్‌ వర్డ్ తెలిసినా కూడా ఇతరులు మీ ఖాతాలోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉండదు.

Privacy online

యాప్‌ కు అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వండి

మొబైల్‌ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసే యాప్‌ లకు కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్ మరియు లొకేషన్ వంటి అత్యంత గోప్యంగా ఉంచే అనుమతులను అవసరమైతేనే ఇవ్వండి. మీరు ఉపయోగించని లేదా చాలా తక్కువగా ఉపయోగించే యాప్‌ ఏదైనా ఉంటే దాని అనుమతులు తొలగించండి.

అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దు

ఈమెయిల్, SMS లేదా సోషల్ మీడియాలో వచ్చే తెలియని లింక్‌ లను తెరవకండి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ కంపెనీల పేరుతో వచ్చే ఫిషింగ్ SMS పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం అలాంటి లింక్స్ యూజర్ ప్రైవసీకి అధిక భంగం కలిగించే ప్రధాన సోర్స్ లుగా చెబుతున్నారు.

సాఫ్ట్‌ వేర్‌ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి

స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, బ్రౌజర్ మరియు యాప్‌ లను తాజా వెర్షన్‌ కు అప్‌డేట్ చేయడం వల్ల భద్రతా లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దబడతాయి. మీకు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్ అప్‌డేట్‌ లను ఎంచుకోండి.

Privacy online

బ్యాంక్ మరియు ఈమెయిల్ రెగ్యులర్ గా చెక్ చేయండి

బ్యాంక్ స్టేట్‌మెంట్‌ లు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, ఈమెయిల్ లాగిన్ అలర్ట్‌ లను క్రమం తప్పకుండా పరిశీలించండి. వీటిలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వండి.

Also Read : OnePlus N6x: టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ పై లుక్కేద్దామా.!

డేటా బ్యాకప్‌ ను అలవాటు చేసుకోండి

ముఖ్యమైన ఫోటోలు, పత్రాలు, ఇతర ఫైళ్లను క్లౌడ్ లేదా బాహ్య స్టోరేజ్‌ తో ఆప్షన్ క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి. ర్యాన్సమ్‌ వేర్ లేదా డేటా నష్టం జరిగినా మీ సమాచారం సురక్షితంగా ఉంటుంది.

ఆన్‌లైన్ ప్రైవసీ కోసం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • ప్రతి ఖాతాకు ప్రత్యేకమైన పాస్‌ వర్డ్‌ ను ఉపయోగించండి.
  • 2FA ను అన్ని ముఖ్యమైన ఖాతాల్లో ప్రారంభించండి.
  • అనుమానాస్పద సందేశాలు, లింక్‌ లను నమ్మవద్దు.
  • యాప్‌ అనుమతులను తరచుగా రివ్యూ చేయండి.
  • సాఫ్ట్‌వేర్‌ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.
  • పబ్లిక్ Wi-Fi లో సున్నితమైన లావాదేవీలను నివారించండి.
  • సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పరిమితంగా మాత్రమే పంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile