WhatsApp లో మీ ప్రొఫైల్ ఫొటో మరియు మీ ఫోన్ నెంబర్ ఇతరులకు కనిపించకుండా చేయొచ్చా.!

Highlights

ప్రతి ఒక్కరికీ WhatsApp ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ యాప్‌ గా మారింది

వ్యక్తిగత చాట్స్, ఆఫీస్ పనులు, ఫొటోలు మరియు వీడియోలు వంటి అనేక అవసరాలకు వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు

మన ప్రొఫైల్ ఫోటోను చూడకుండా ఉండాలంటే వాట్సాప్ లో కొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ WhatsApp ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ యాప్‌ గా మారింది. వ్యక్తిగత చాట్స్, ఆఫీస్ పనులు, ఫొటోలు మరియు వీడియోలు వంటి అనేక అవసరాలకు వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. అయితే, మన ఫోన్ నెంబర్, ప్రొఫైల్ ఫోటో మరియు లాస్ట్ సీన్ వంటి వివరాలు ఇతరులకు కనిపించడం కొన్నిసార్లు ప్రైవసీ సమస్యలకు కారణం కావచ్చు. ముఖ్యంగా, మనకు తెలియని వ్యక్తులు మన ప్రొఫైల్ ఫోటోను చూడకుండా ఉండాలంటే వాట్సాప్ లో కొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.

WhatsApp ప్రొఫైల్ ఫోటో ఇతరులకు కనిపించకుండా చేయడం ఎలా?

ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌ లో వాట్సాప్ ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్‌ లో కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి Settings లోకి వెళ్ళండి. అదే ఐఫోన్‌ లో అయితే నేరుగా Settings ఆప్షన్‌ ను ఎంచుకోండి. తర్వాత Privacy పై క్లిక్ చేసి ప్రొఫైల్ ఫోటో ఆప్షన్‌ ను ఓపెన్ చేయండి. ఇక్కడ Everyone, My Contacts, My Contacts Except…, Nobody అనే ఆప్షన్లు కనిపిస్తాయి.

మీ ఫొటో ఎవరికీ కనిపించకూడదనుకుంటే Nobody అనే ఆప్షన్ ఎంచుకోండి. మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపించాలంటే My Contacts అని ఎంచుకోవచ్చు. ఇలా మీ వాట్సప్ ప్రొఫైల్ ఫోటో అందరూ చూడకుండా దాచుకోవచ్చు. ఇది తమ ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని అనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.

ఫోన్ నంబర్‌ దాచడం సాధ్యమేనా?

వాట్సాప్ లో ప్రస్తుతం ఫోన్ నంబర్‌ ను పూర్తిగా దాచేందుకు ప్రత్యేకంగా విధమైన సెట్టింగ్ కూడా అందుబాటులో లేదు. అంటే, మీరు ఇతరులతో చాట్ చేసినప్పుడు లేదా గ్రూప్ లో ఉన్నప్పుడు మీ నంబర్ వారికి కనిపించే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని వెర్షన్లు మరియు ఖాతాలో Username ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఇది అందుబాటులో ఉంటే కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో నంబర్‌ ను షేర్ చేయకుండా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ ఇప్పటికే అందరికీ అందుబాటులో ఉందని మనం చెప్పలేము. అయితే, ఈ ఫీచర్ కొంత మందికి అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆప్షన్ వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎదుటి వారికి మీ నెంబర్ కనిపించకుండా మీరు చాటింగ్ కొనసాగించే అవకాశం ఉంటుంది. రిపోర్ట్ ప్రకారం ఈ ఫీచర్ ఇండియాలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్ గురించి చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది.

బెస్ట్ ప్రైవసీ సెట్టింగ్స్

మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ లో లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ ఆప్షన్‌ ను ఎంచుకుని Nobody లేదా తగిన పరిమితిని పెట్టుకోవచ్చు. About ఆప్షన్‌ లో కూడా Nobody ఎంచుకోవచ్చు. అలాగే Groups సెట్టింగ్‌ లో My Contacts లేదా My Contacts Except… ఎంచుకుంటే తెలియని వ్యక్తులు నేరుగా మిమ్మల్ని గ్రూప్ లలో చేర్చకుండా నియంత్రించవచ్చు.

ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వాట్సాప్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు. అయితే, ఈ సెట్టింగ్స్ మీ ఫోన్ నంబర్‌ ను పూర్తిగా దాచవని గుర్తుంచుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile