మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ లో Unknown Apps లను ఎలా గుర్తించాలి మరియు తొలగించాలి.!

HIGHLIGHTS

కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని యాప్‌ లు ఫోన్‌ లో కనిపించవచ్చు

యాప్‌ లు ఇతర యాప్‌ లతో పాటు ఇన్‌ స్టాల్ కావచ్చు లేదా అనుమానాస్పద పనులు చేసే అవకాశం ఉంటుంది

Unknown Apps మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వంటి సమస్యలకు కారణం కావచ్చు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ లో Unknown Apps లను ఎలా గుర్తించాలి మరియు తొలగించాలి.!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అంటే తెలియని వారుండరు మరియు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్‌ ఫోన్‌ లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నడిపించడానికి మరియు మన అవసరాలు బట్టి ఆండ్రాయిడ్ ఫోన్‌ లో అనేక యాప్‌ లను ఇన్‌స్టాల్ చేసుకుంటాం. అయితే, కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని యాప్‌ లు ఫోన్‌ లో కనిపించవచ్చు. మరికొన్ని యాప్‌ లు ఇతర యాప్‌ లతో పాటు ఇన్‌ స్టాల్ కావచ్చు లేదా అనుమానాస్పద పనులు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనుమానిత లేదా Unknown Apps మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం మరియు అనవసరమైన యాడ్స్ చూపించడం లేదా ఫోన్ పెర్ఫార్మెన్స్ తగ్గించడం వంటి సమస్యలకు కారణం కావచ్చు. అందువల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ లో ఉన్న యాప్‌ లను ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ముఖ్యం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అందుకే, ఈరోజు ఈ ఆర్టికల్‌ లో మీ ఫోన్‌ లో Unknown Apps ను ఎలా గుర్తించాలి, వాటి వివరాలను ఎలా తెలుసుకోవాలి మరియు అవసరం లేని యాప్‌ లను ఎలా తొలగించాలి అనే విషయాలను దశలవారీగా వివరంగా తెలుసుకుందాం.

ఫోన్ లో యాప్‌ లను చెక్ చేయండి

మీ ఫోన్ లో ఉన్న గుర్తు తెలియని యాప్‌ లను గుర్తించడానికి ముందుగా మీ ఫోన్‌ లో ఇన్‌ స్టాల్ అయిన అన్ని యాప్‌ల జాబితాను చూడాలి. చెక్ చేయడానికి క్రింద ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
  • Apps (యాప్‌లు) లేదా Apps & notifications అనే ఆప్షన్‌ ను ఎంచుకోండి.
  • See all apps లేదా App Management పై ట్యాప్ చేయండి.
  • మీ ఫోన్‌ లో ఇన్‌ స్టాల్ అయిన యాప్‌ల జాబితాను పరిశీలించండి.
  • మీకు తెలియని లేదా మీరు ఎప్పుడూ ఉపయోగించని యాప్‌ పేర్లను గమనించండి.

వేర్వేరు ఆండ్రాయిడ్ ఫోన్‌ లలో సెట్టింగ్స్ పేర్లు కొద్దిగా మారవచ్చు. అలాగే, మీరు గుర్తించలేని ప్రతి యాప్ ప్రమాదకరమైనదని భావించకండి. కొన్ని యాప్‌ లు మీ ఫోన్ సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సిస్టమ్ యాప్‌లు కావచ్చని గమనించాలి.

Unknown Apps వివరాలు తెలుసుకోండి

మీ ఫోన్ లో మీకు తెలియని యాప్ కనిపించిన వెంటనే దాన్ని తొలగించకుండా, ముందు దాని వివరాలు చెక్ చేయండి. అంటే, ఆ యాప్ పేరు, ఆ యాప్ ని మీరు డౌన్ లోడ్ చేసారా లేదా మరియు ఈ యాప్ మీ ఫోన్లో మీకు ఉపయోగకరమైన యాప్ అవునా లేక కాదా అని చెక్ చేయండి.

Unknown Apps

యాప్ పేరు తెలియకపోవడం లేదా ఎక్కువ బ్యాటరీ వినియోగించడం ఒక్కటే అది వైరస్ అని నిరూపించదు. కాబట్టి మీరు ఆ యాప్ ఇతర వివరాలను కూడా పరిశీలించాలి.

Also Read: BSNL Offer: రేపటితో ముగియనున్న సూపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile