మీ ఫోన్ లో ఉన్న App మీ పర్సనల్ డేటా దొంగిలిస్తోందని డౌట్ ఉంటే ఇలా చెక్ చేయండి.!

HIGHLIGHTS

ఈ రోజుల్లో మనం ఉపయోగించే ప్రతి మొబైల్ యాప్ కూడా ఏదో స్థాయిలో మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది

కొన్ని యాప్స్ మాత్రం అవసరానికి మించి డేటాను సేకరించడం లేదా గోప్యంగా ఉపయోగించడం వంటివి చేస్తుంటాయి

యాప్ మీ డేటాను దొంగిలిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అవుతుంది

మీ ఫోన్ లో ఉన్న App మీ పర్సనల్ డేటా దొంగిలిస్తోందని డౌట్ ఉంటే ఇలా చెక్ చేయండి.!

ఈ రోజుల్లో మనం ఉపయోగించే ప్రతి మొబైల్ App కూడా ఏదో స్థాయిలో మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. కానీ, కొన్ని యాప్స్ మాత్రం అవసరానికి మించి డేటాను సేకరించడం లేదా గోప్యంగా ఉపయోగించడం వంటివి చేస్తుంటాయి. అందుకే, ఒక యాప్ మీ డేటాను దొంగిలిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. ఇది ఎలా చెక్ చేయాలో సవివరంగా తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

యాప్ Permissions చెక్ చేయండి

మీ ఫోన్ లో ఏ యాప్ ఇన్‌ స్టాల్ చేసినా కూడా అది ఎలాంటి అనుమతులు (Permissions) కోరుతోంది అనేది మీరు క్లియర్ గా చూడాలి. ఏ యాప్ అయినా సరే మీ ఫోన్ కాంటాక్ట్ లేదా లొకేషన్ అడిగితే అది అనుమానాస్పదమైన విషయంగా భావించాలి.

ఏదైనా యాప్ మీద మీకు డౌట్ ఉంటే వెంటనే ఫోన్ Settings లోకి వెళ్ళి అందులో వున్న Apps మరియు లోపల Permissions లోకి వెళ్లి చెక్ చేయండి. ప్రతి యాప్ చెక్ చేసి అవసరం లేని అనుమతులను వెంటనే ఆఫ్ చేయండి.

యాప్ రివ్యూ మరియు రేటింగ్ చూడండి

ప్లే స్టోర్ నుంచి లో యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందుగా సదరు యాప్ రివ్యూ మరియు రేటింగ్ చూడండి. ఇందులో ఇతర యూజర్లు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ ‘డేటా లీక్’ లేదా ‘ప్రైవసీ ఇష్యు’ వంటి కామెంట్స్ ఉన్నాయా చూడండి. ఉంటే ఆ యాప్ అవాయిడ్ చేయండి.

How to check an app (1)

డేటా వినియోగం పరిశీలించండి

ఒక యాప్ ఎక్కువగా బ్యాక్‌ గ్రౌండ్‌ నిరంతరం డేటా ఉపయోగిస్తే, అది మీ సమాచారం ఇతరులకు పంపే అవకాశం ఉంటుంది. ఇది కనిపెట్టడానికి ఫోన్ సెట్టింగ్స్ లో ఉన్న నెట్ వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్ లో ఉన్న డేటా యూసేజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏ యాప్ ఎక్కువ డేటా తీసుకుంటుందో చూడండి. సాధారణ యాప్ అయితే కూడా ఎక్కువ డేటా వాడితే మాత్రం జాగ్రత్త పదండి.

యాప్ ప్రైవసీ డీటెయిల్స్ చదవండి

యాప్ స్టోర్ లో ప్రతి యాప్‌కు డేటా సేఫ్టీ సెక్షన్ ఉంటుంది. ఇందులో ఆ యాప్ ఏ డేటా సేకరిస్తుంది మరియు ఎవరితో షేర్ చేస్తుంది వంటి వివరాలు ఉంటాయి. ఒకవేళ ఆప్ కనుక కాంటాక్ట్ లోకేషన్ మరియు మెసేజ్ వంటి వివరాలు కలెక్ట్ చేస్తుంటే మాత్రం అనుమానించ తగిన విషయం అవుతుంది మరియు జాగ్రత్త వహించడం అవసరం.

బ్యాక్‌ గ్రౌండ్ యాక్టివిటీ నియంత్రించండి

కొన్ని యాప్స్ మీరు ఉపయోగించకపోయినా బ్యాక్‌ గ్రౌండ్‌ లో పనిచేస్తుంటాయి. వాటిని ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ లో ఉండే బ్యాటరీ ఎంచుకుని ‘Background restriction’ ఆప్షన్ ను ఎనేబుల్ చేయండి. ఇక్కడ అవసరం లేని యాప్స్‌కు బ్యాక్‌ గ్రౌండ్ యూసేజ్ డిసేబుల్ చేయండి.

How to check an app (1)

అనుమానాస్పద ప్రవర్తన గమనించండి

మీ ఫోన్ లో సడన్ గా కొన్ని కొత్త మార్పులు కనిపిస్తే గమనించండి. అంటే, ఫోన్ సడెన్‌గా స్లో అవ్వడం, బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం మరియు అనవసరంగా Ads ఎక్కువగా రావడం వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త. ఎందుకంటే, ఇవి మాల్వేర్ లేదా డేటా ట్రాకింగ్ సూచనలు అయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: Samsung 55 ఇంచ్ Smart TV పై రూ. 4,900 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

నమ్మకమైన మాత్రమే ఉపయోగించండి

మీరు ఎప్పుడు కూడా అఫీషియల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ ఇన్‌ స్టాల్ చేయండి. గుర్తు తెలియని సోర్స్ నుంచి APK ఫైల్స్ డౌన్‌ లోడ్ చేయడం మానుకోండి.

గమనిక : మీ డేటా సురక్షితంగా ఉండాలంటే, మీ ఫోన్ యాప్ అనుమతులు, డేటా వినియోగం, ప్రైవసీ సెట్టింగ్స్ వంటి అంశాలను తరచూ చెక్ చేయడం చాలా అవసరం. అనుమానం కలిగిన యాప్స్ ను తొలగించడం లేదా అనుమతులు తగ్గించడం చేయడానికి అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo