కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్: క్లోజ్ ఇమేజెస్ అండ్ డిటేల్స్

కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్: క్లోజ్ ఇమేజెస్ అండ్ డిటేల్స్

కూల్ ప్యాడ్ కంపెని.. ఫుల్ HD డిస్ప్లే మరియు slight గా పెరిగిన బరువు, ఈ రెండు changes తో కొత్తగా మార్కెట్ లో నోట్ 3 ప్లస్ వేరియంట్ ను 8,999 రూ లకు లాంచ్ చేసిన సంగతి తెలిసినదే.

క్విక్ స్పెక్స్ ను ఇక్కడ చూడండి.. 
Display: 5.5-inch, 1080p, SoC: MediaTek MT6753, RAM: 3GB, Storage: 16GB, microSD card support: Yes, 64GB, Camera: 13MP, 5MP, Battery: 3000mAh

డిజైన్ అండ్ లుక్స్ లో మార్పులు ఏమీ లేవు అని మీరు చూసినవెంటనే చెప్పగలుగుతారు. కాని డిస్ప్లే vibrant గా ఉంది FHD వలన. అలాగే సన్ లైట్ లో కూడా ఫోన్ బాగా బ్రైట్ గా కనిపిస్తుంది.

Lite మోడల్ లానే దీనిలో కూడా డిస్ప్లే చుట్టూ గోల్డ్ ఫినిషింగ్ outer ring ఉంటుంది. వైట్ అండ్ గోల్డ్ రెండు కలర్స్ లో వస్తున్న ప్లస్ కు స్పీకర్ వెనుక ఉంది.

క్రింద ఉన్నది గోల్డ్ వేరియంట్. కంపెని ఈ మోడల్ తోనే మొదలుపెట్టింది గోల్డ్ వేరియంట్. వెనుక ఉన్న పనెల్ removable, మీరు చూసినట్లు అయితే వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

ప్లస్ మోడల్ కూడా మిగిలిన రెండు మోడల్స్ లానే ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1 పై రన్ అవుతుంది. ఈ os వెర్షన్ కూల్ UI 6.0 ఉంది. కంపెని రీసెంట్ గా మార్ష్ మల్లో బీటా వెర్షన్ ను డెవలపర్స్ కు రిలీజ్ చేసింది. దానిలో మంచి ui changes అండ్ సుపర్బ్ ఫీచర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఈ లింక్ లో చూడండి.

కెమెరా UI లో చేంజ్ ఏమీ లేదు. సింపుల్ గా ఉంది. Pro మోడ్ కూడా ఉంది. ఈ మోడ్ లో కెమెరా సెట్టింగ్స్ ను users కు నచ్చినట్లుగా మార్చుకోగలరు. అయితే ఇదేమి కొత్త ఫీచర్ కాదు.

క్విక్ బెంచ్ మార్క్ స్కోర్స్ చూడండి ఇక్కడ. AnTuTu అండ్ గీక్ బెంచ్ బెంచ్ మార్క్స్  ను రన్ చేసాము ప్లస్ లో. క్రింద చూడండి డివైజ్ ఎలా పెర్ఫరం చేసిందో..

 

ఈ ఫోన్ తో ఇప్పుడు కంపెని కు మూడు హాండ్ సెట్స్ ఉన్నాయి సబ్ 10K బడ్జెట్ లో. క్రింద ఇమేజ్ లో మొదటిది నోట్ 3(Rs. 8,499),  రెండవది నోట్ 3 ప్లస్(Rs. 8,999), మూడవది నోట్ 3 Lite(Rs. 6,999).

 

 

 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo