Coolpad MAX : మొదటి ఇంప్రెషన్స్

Coolpad MAX : మొదటి ఇంప్రెషన్స్

కూల్ ప్యాడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ చేసింది లాస్ట్ week. ఇది అన్ని బేసిక్ ఫీచర్స్ ను కవర్ చేసింది. metal బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్,  okay అనిపించే పవర్ ఫుల్ ఆక్టో కోర్ SoC. కానీ ఇవి సరిపోతాయా కరెంట్ మార్కెట్ లో?

ఫోన్ లో మొదటిగా notice చేసిన విషయం ఫోన్ బ్యూటిఫుల్ మెటల్ బాడీ. అలాగని ఇదేమి ఫ్రెష్ డిజైన్ తో రావటం లేదు. Le1S, Elife S6 ఇలాంటి డిజైన్స్ తో ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. కాని మాక్స్ డిజైన్ ఎక్కువ ప్రీమియం గా ఉందని చెప్పవచ్చు.

డిజైన్ 2.5D curve డిజైన్ తో మరింత బాగుంది. చాలా ఫోనుల కన్నా బెటర్ టచ్ ఫీలింగ్ కూడా ఇస్తుంది. నేవిగేషన్ బటన్స్ ను స్క్రీన్ లోనే కలిపేయటం వలన ఫోన్ క్రింద మరియు పై భాగంలో ఎక్కువ బెజేల్స్ లేవు. బెజెల్స్ ఎంత చిన్నగా తక్కువగా ఉంటె ఫోన్ అంత కాంపాక్ట్ గా స్మాల్ గా ఉంటుంది.

out of the బాక్స్ UI ఏమీ కలర్ ఫుల్ గా లేదు. కాని థీమ్ మేనేజర్ లో కలర్ ఫుల్ థీమ్స్ ను ఎంచుకోగలరు. కొత్తగా dual domain లేదా dual spaces అనే ఫీచర్ ను ప్రవేశ పెట్టింది ఫోన్ లో. ఇది బేసిక్ గా లాలిపాప్ లో introduce అయిన గూగల్ user అకౌంట్స్ ఆప్షన్ అని చెప్పాలి. దానికి అదనంగా enhanced సెక్యూరిటీ ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది. ఈ డ్యూయల్ స్పేస్ సిస్టం మీ యాప్స్ ను సెపరేట్ గా రెండు partitions లో ఉంచుతుంది. అయితే యాప్ డేటా కూడా సేపరేట్ గా ఉంచుతుండా లేదా అనేది ఇంకా టెస్ట్ చేయాలి.

స్నాప్ డ్రాగన్ 617 SoC ఉంది లోపల. దీనికి జోడిగా 4GB ర్యామ్ వస్తుంది. మేము గడిపిన కొద్ది క్షణాలలో లాగ్ లేదా slow అనేది ఎక్కడ చూడలేదు. HD వీడియోస్ ను కూడా ప్లే చేయటం జరిగింది. ఎక్కడ issues లేవు. ఇక్కడ బెంచ్ మార్క్స్ యొక్క క్విక్ లుక్స్ చూడండి…

              

మొదటి సారిగా 13MP కెమెరా okay అనిపించింది ఫోకస్ అండ్ స్పీడ్ విషయాలలో. అయితే ఇమేజ్ క్వాలిటీ మాత్రం intresting అనిపించలేదు.  ఫుల్ రివ్యూ లో మరింత లోతుగా మరియు ఇతర ఫోనులతో కంపేర్ చేసి తెలియజేస్తాము. క్రింద శాంపిల్ షాట్స్ చూడగలరు.

 

Click to enlarge

స్పెక్స్ పరంగా కూల్ ప్యాడ్ మాక్స్ Mi 5 ను మించలేదని ఈజీగా తెలిసిపోతుంది. అయితే సరైన స్పెక్స్ లేకపోయినా ఫోన్ ఎంత బాగా పనిచేస్తుంది అనే దానికి example గా నిలిచిన HTC one A9 లా అనిపిస్తుంది కూల్ ప్యాడ్ మాక్స్ పెర్ఫార్మన్స్. ఇది నిజమైతే మంచి విషయమే. అది ఫుల్ రివ్యూ లో తెలుస్తుంది.

 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo