సైబర్ నేరాల కొత్త పర్వం: Fake Apps నుంచి Smart Scams వరకు పూర్తిగా తెలుసుకోండి.!
ఇప్పుడు మోసాలు అధునాతన టెక్నాలజీతో Fake Apps నుంచి Smart Scams గా మారాయి
ఈ మోసాలకు సాధారణ వినియోగదారులు కూడా ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీతో మరింత అప్గ్రేడ్ అవుతున్నారు
సైబర్ నేరాల కొత్త పర్వం: డిజిటల్ ఇండియా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా సైబర్ నేరాలు కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. గతంలో సాధారణ ఫిషింగ్ మెయిల్స్ కి మాత్రమే పరిమితమైన మోసాలు ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో Fake Apps నుంచి Smart Scams గా మారాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, UPI చెల్లింపులు మరియు సోషల్ మీడియా వినియోగం అతిగా పెరగడం వల్ల ఈ మోసాలకు సాధారణ వినియోగదారులు కూడా ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు.
SurveyFake Apps: చెప్పేదొకటి చేసేదొకటి
నేటి నవీన యుగంలో సైబర్ నేరాల్లో ముఖ్యమైన పద్ధతి “ఫేక్ యాప్స్”. ఇది సాధారణ యూజర్ ను మోసం చేయడానికి చాలా సులభమైన పద్దతిగా ఉంటుంది. స్కామర్లు బ్యాంకింగ్, లోన్, గేమింగ్ యాప్స్ పేరుతో నకిలీ యాప్స్ రూపొందిస్తున్నారు. ఈ ఫేక్ యాప్స్ యూజర్ డేటా, అంటే OTP, బ్యాంక్ వివరాలు మరియు కాంటాక్ట్ వంటి వివరాలు సేకరిస్తాయి. అంతేకాదు, కొన్నిసార్లు మాల్వేర్ ఇన్ స్టాల్ చేసి మీ ఫోన్ ను పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా థర్డ్ పార్టీ APKs ద్వారా వచ్చే యాప్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి.
ఈ యాప్స్ చూడటానికి నార్మల్ మరియు మనం రెగ్యులర్ గా వాడే యాప్స్ మాదిరిగానే కనిపిస్తాయి. అయితే, ఈ యాప్స్ మీ అనుమతి లేకుండా మీ పూర్తి డేటా తస్కరించి మీకు తీరని నష్టం కలిగిస్తాయి. అందుకే, ఫేక్ యాప్స్ చెప్పేదొకటి, చేసేదొకటి అని చెబుతారు.
UPI అండ్ పేమెంట్ స్కామ్
భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ విస్తరణతో పాటు మోసాలు కూడా మరింత బాగా పెరిగాయి. అన్నింటి కంటే ఎక్కువగా జరిగే స్కామ్ “Collect Request” స్కామ్ అని చెప్పవచ్చు. అంటే, డబ్బు పంపుతున్నట్టు చెప్పి డబ్బు రిసీవ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పంపిస్తారు. ఆదమరచి ఈ రిక్వెస్ట్ పై క్లిక్ చేసే అకౌంట్ నుంచి డబ్బు మాయం అవుతుంది. ముఖ్యంగా Google Pay, PhonePe, Paytm వంటి పేమెంట్ యాప్స్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలి.

ప్రస్తుతం స్కామర్లు ఉపయోగించే మరొక కొత్త స్కామ్ QR కోడ్ స్కామ్. ఈ స్కామ్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బు కట్ అవుతాయి. మరింత ముఖ్యమైన మరియు ప్రమాదకరమైన స్కామ్ Fake customer care నంబర్ స్కామ్. ఆన్లైన్ లో ప్రస్తుతం కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికితే దాదాపు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ మాత్రమే దర్శనమిస్తున్నాయి. అంధుకే, అఫీషియల్ సైట్ ను మాత్రమే సందర్శించండి.
AI ఆధారిత Smart Scams
ఇప్పుడు కాలంతో పాటు మోసాలు కూడా స్మార్ట్ అయ్యాయి. ఇందులో మొదటిది వాయిస్ క్లోనింగ్ స్కామ్. మీ బంధువుల వాయిస్ ను పోలిన వాయిస్ ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఆ వాయిస్ తో కాల్ చేసి డబ్బు అడగడం చేస్తారు. ఇదే పద్దతిలో తయారు చేసే Deepfake వీడియోలు కూడా స్మార్ట్ స్కామ్ లో ప్రధాన భాగస్వామి అవుతుంది. ఇది కాకుండా ఏఐ సహాయం తో క్రియేట్ చేసే మెసేజెస్ కూడా స్మార్ట్ స్కామ్ లో భాగం అవుతాయి. మరింత గొప్పగా ఎదిగిన ఏఐ టెక్నాలజీ వల్ల నిజం మరియు నకిలీ మధ్య తేడా గుర్తించడం చాలా కష్టం అవుతోంది.
OTP అండ్ KYC స్కామ్
మీ KYC అప్డేట్ చేయాలని అని కాల్స్ వస్తాయి మరియు ఈ కాల్ లో OTP చెప్పమని అడుగుతారు. మీరు ఈ కాల్ నిజమని నమ్మి ఒకసారి OTP చెప్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాస్తవానికి, బ్యాంకులు ఎప్పుడూ OTP అడగవు.
Also Read: SASA LELE Sale బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసిన Flipkart
సోషల్ మీడియా స్కామ్
సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగే స్కామ్ ‘ఫేక్ జాబ్ ఆఫర్’ అని చెబుతారు. ఎటువంటి ఎక్స్ పీరియన్స్ లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెబుతారు. అయితే, ఇది మీ నుంచి డబ్బు గుంజడానికి స్కామర్లు వేసే వల అని మీరు గమనించాలి. రెండోది లాటరీ మరియు ప్రైజ్ స్కామ్. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న స్కామ్. కొన్ని రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ మరియు Instagram ద్వారా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
నేటి నవీన యుగంలో స్కామర్లు వేసే వల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎప్పుడూ కూడా అఫీషియల్ యాప్ స్టోర్ నుంచే యాప్స్ డౌన్ లోడ్ చేయండి. మీ ఫోన్ కు మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద links ఓపెన్ చేయవద్దు. మీ ఫోన్ కు వచ్చే OTP ఎవరికీ చెప్పొద్దు. మీ ఫోన్ లో చాలా బలమైన పాస్వర్డ్ ఉపయోగించండి. మీ ఫోన్ లో ఉన్న యాప్స్ పర్మిషన్ ను రెగ్యులర్ గా చెక్ చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile