ChatGPT Weight Loss Prompts for better results
ChatGPT Weight Loss Prompts: మనం ప్రస్తుతం డిజిటల్ యుగంలో సాగుతున్నాము మరియు ఇప్పుడు Artificial Intelligence (AI) మన జీవితంలోని ప్రతి రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే మెడికల్, మీడియా మరియు సాఫ్ట్ వేర్ రంగాల్లో లోతుగా తన ప్రభావాన్ని చూపింది. అయితే, ఇప్పుడు ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ రంగంలో కూడా AI తన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ChatGPT వంటి AI tools ఇప్పుడు వ్యక్తిగత ఫిట్ నెస్ కోచ్ లాగా మారుతున్నాయి. కచ్చితమైన వివరాలు అందిస్తూ మరింత ప్రాముఖ్యత పొందుతున్నాయి.
చాట్ జిపిటి మనకు అనేక విషయాల్లో సహాయం చేయగలదు. ఇందులో హెల్త్ మరియు ఫిట్ నెస్ కోసం చేసే పనులకు కూడా సహాయం చేస్తుంది. చాట్ జిపిటి లో మీరు సరైన ప్రాంప్ట్ అందిస్తే, మీకు సరైన సహాయం అందిస్తుంది. మీఋ బరువు తగ్గడానికి అవసరమైన సహాయం కోసం మీరు అడిగే లేదా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ను చాట్ జిపిటి వైట్ లాస్ ప్రాంప్ట్ అంటాము.
ఉదాహరణకు “నా వయసు 28 సంవత్సరాలు. నేను 10 కిలోలు తగ్గాలి. నాకు ఒక vegetarian diet plan తయారు చేయండి.” అని మీరు చాట్ జిపిటి లో ప్రాంప్ట్ అందిస్తే మీకు క్రిస్టల్ క్లియర్ డైట్ చార్ట్ ను క్రియేట్ చేసి అందిస్తుంది. ఇలాంటి ప్రాంప్ట్ క్లియర్ గా ఇచ్చినప్పుడు మీ అవసరానికి తగ్గట్టు పర్సనలైజ్డ్ సమాధానం ఇస్తుంది.
ఇది మీ మీ వయసు, బరువు, లైఫ్ స్టైల్ ఆధారంగా సలహాలు ఇస్తుంది. మిమ్మల్ని రెగ్యులర్ గా మోటివేట్ చేయడానికి ఇది మీకు డైలీ మోటివేషన్ కోట్స్ మరియు రిమైండర్స్ ఇవ్వగలదు. ముఖ్యంగా, సమయం తో పనిలేకుండా మీరు ఎప్పుడైనా ప్రశ్నలు అడగొచ్చు. ఇది మీ ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా రోజువారి డైట్ చార్ట్ తయారు చేస్తుంది. ఇది మీ డైలీ హోమ్ వర్క్ అవుట్ నుంచి జిమ్ రొటీన్ వరకు సూచిస్తుంది.
ఇప్పటి వరకు చాట్ జిపిటి వైట్ లాస్ ప్రాంప్ట్ గురించి వివరంగా తెలుసుకున్నాము కదా, ఇప్పుడు బెస్ట్ ప్రాంప్ట్ లను కూడా చూద్దాం.
“నేను 30 ఏళ్ల మహిళను. నా బరువు 78 కేజీలు 3 నెలల్లో 8 కేజీలు బరువు తగ్గడానికి సౌత్ ఇండియా వెజిటేరియన్ డైట్ ప్లాన్ తయారు చేయండి.”
ఇది ఇంట్లో వర్క్ అవుట్ చేయకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ప్రాంప్ట్ అవుతుంది. మీరు కూడా ఇంట్లో ఉంటూ బరువు తగ్గాలనుకుంటే ఈ ప్రాంప్ట్ ట్రై చేయవచ్చు.
“Low calorie తెలుగు breakfast recipes చెప్పండి.”
ఈ ప్రాంప్ట్ ఉపయోగించి మంచి హెల్తీ ఫుడ్ ఐడియాలు వెంటనే పొందవచ్చు.
“బిగినర్స్ కోసం ఇంట్లో ఎక్విప్మెంట్ లేకుండా చేయగల 30 నిమిషాల ఫ్యాట్ లాస్ వర్క్ అవుట్ ఐడియా ఇవ్వండి.”
“రోజుకు 1500 కెలోరీస్ లో ఉండే ఫుడ్ ఐడియా ఇవ్వండి.”
ఇది రోజు వారి కెలోరీలు ట్రాక్ చేయడానికి సహాయం చేస్తుంది మరియు వెయిట్ లాస్ కోసం బాగా ఉపయోగపడుతుంది.
“బరువు తగ్గడం కోసం sleep, water intake, walking habits ఎలా ఉండాలి?”
ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ ప్రాంప్ట్ బాగా సహకరిస్తుంది. రోజు వారి జీవన విధానంలో మార్పు తెస్తుంది.
“మోటివేషన్ జర్నీలో నా మోటివేషన్ మైంటైన్ చేయడానికి డైలీ మోటివేషన్ కోట్స్ ఇవ్వండి.”
ప్రతి రోజు ఉత్సాహం కోసం ఇది చాలా అవసరం అవుతుంది.
మీరు బరువు తగ్గాలనుకుంటే ముందుగా మీ గోల్ సెట్ చేసుకోవడం అవసరం. అంటే, మీరు ఎంత బరువు తగ్గాలి? మరియు ఎంత టైమ్‌లో తగ్గాలి? అనే పాయింట్స్ గోల్ గా పెట్టుకోండి. ప్రాంప్ట్ లో మీ వయసు, బరువు, ఆహారపు అలవాట్లు వంటి వివరాలు అందించండి. ఇలా చేస్తే మీకు తగిన సలహాలు మరియు సూచనలు అందుతాయి.
Also Read: OnePlus Nord CE 6 Lite: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!
ఇది అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం. AI Doctor కాదు మరియు చాట్ జిపిటి ఇచ్చే సమాచారం సాధారణ గైడెన్స్ మాత్రమే అని గుర్తుంచుకోండి. మీకు ముందు నుంచే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ లేదా న్యూట్రీషియన్ ను సంప్రదించండి.