ChatGPT Video Editing Prompts: AI యుగంలో వీడియో ఎడిటింగ్ విప్లవం.!

HIGHLIGHTS

నేటి డిజిటల్ ప్రపంచంలో వీడియో కంటెంట్ రాజ్యమేలుతోంది

సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసినా వీడియోలే కనిపిస్తాయి

ChatGPT Video Editing Prompts క్రియేటర్ కి కొత్త దారులు చూపిస్తున్నాయి

ChatGPT Video Editing Prompts: AI యుగంలో వీడియో ఎడిటింగ్ విప్లవం.!

నేటి డిజిటల్ ప్రపంచంలో వీడియో కంటెంట్ రాజ్యమేలుతోంది. యూట్యూబ్ రీల్స్, షార్ట్ వీడియోలు అంతెందుకు అన్ని సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసినా వీడియోలే కనిపిస్తాయి. అంతగా, వీడియోలు ప్రపంచాన్ని చుట్టేసాయి. కానీ ఒక మంచి వీడియో తయారు చేయడం అంటే కేవలం షూట్ చేయడం మాత్రమే కాదు, ఎడిటింగ్ అనే కళలో కూడా గొప్ప నైపుణ్యం అవసరం అవుతుంది. అయితే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తర్వాత చాలా సులభం అయ్యింది. ముఖ్యంగా, ChatGPT Video Editing Prompts క్రియేటర్ కి కొత్త దారులు చూపిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Video Editing Prompts అంటే ఏమిటి?

ఈ వీడియోను ఎలా ఎడిట్ చేయాలి అనే దానికి మనం ఇచ్చే స్పష్టమైన ఆదేశాలు వీడియో ఎడిటింగ్ ప్రాంప్ట్ అవుతుంది. ఉదాహరణకు “10 నిమిషాల యూట్యూబ్ వీడియోను ఫాస్ట్ పేస్‌తో ఎడిట్ చేయడానికి స్టెప్స్ ఇవ్వు” అని మనం అడిగితే చాట్ జిపిటి దానికి అనుగుణంగా ప్రాంప్ట్ అందిస్తుంది. AI ఇలాంటి ప్రాంప్ట్‌ లతో ఎడిటింగ్ స్టైల్, కట్ పాయింట్స్, మ్యూజిక్ ఐడియాలు మరియు ట్రాన్సిషన్‌లు కూడా సూచిస్తుంది.

క్రియేటర్ కి ఇది ఎందుకు గేమ్ చేంజర్?

గతంలో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి నెలలు పట్టేది. ముఖ్యంగా, సాఫ్ట్‌ వేర్ స్కిల్స్ అవసరం అయ్యేది. అయితే, ఇప్పుడు AI ని ఐడియాలు కోరిన వెంటనే ఇచ్చేస్తుంది. టైమ్ సేవ్ అవుతుంది మరియు బిగినర్స్ కూడా ప్రొఫెషనల్ లుక్ వీడియోలు చేయగలుగుతారు.

ChatGPT Video Editing Prompts

ఉపయోగాలు

యూట్యూబ్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ వైరల్ ట్రెండింగ్ స్టైల్ లో షార్ట్స్ మరియు మనకు అవసరమైన ఎడ్యుకేషన్ వీడియోలు కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ ప్రాంప్ట్

“Act as a professional video editor. Give me a complete editing plan for a YouTube video on [topic]. Include intro hook, pacing, cut points, background music style, transitions, and outro strategy to maximize audience retention.”

ఈ ప్రాంప్ట్ యూట్యూబ్ క్రియేటర్స్, టెక్, వ్లాగ్ మరియు ఎడ్యుకేషనల్ వీడియోల కోసం బెస్ట్ ప్రాంప్ట్ అవుతుంది.

Also Read: ఆన్లైన్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కోసం ఎలా అప్లై చేసుకోవాలి.!

వైరల్ రీల్ లేదా షార్ట్ ప్రాంప్ట్

“Give me a viral Instagram Reel editing style for [topic]. Include hook in the first 3 seconds, fast cuts, trending transitions, caption style, and background music ideas to increase engagement.”

ఇది ఇంస్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్స్ కోసం బెస్ట్ ప్రాంప్ట్ అవుతుంది. వీడియో ట్రెండ్ లేదా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది.

ChatGPT Video Editing Prompts

బిగినర్స్ కోసం బై స్టెప్ ప్రాంప్ట్

“Explain how to edit a video on [software name] for beginners. Give step-by-step instructions including cutting clips, adding music, transitions, text, and exporting in best quality.”

ఈ ప్రాంప్ట్ CapCut మరియు Adobe Premiere Pro వంటి టూల్స్ తో చాలా చక్కని అవుట్ పుట్ ఇస్తుంది.

ఇక్కడ అందించిన ప్రాంప్ట్ లో టాపిక్ ప్లేస్ లో మీ సొంత ఐడియా ని అందించండి. అలాగే, మీరు లక్ష్యం చేసిన ఆడియన్స్ ని కూడా ఇందులో అందించండి.

ఏ టూల్స్‌తో కలిపి వాడాలి?

AI ప్రాంప్ట్‌లు మరియు ఎడిటింగ్ సాఫ్ట్‌ వేర్ వాడకం అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. క్యాప్ కట్, అడోబ్ ప్రీమియర్ ప్రో, డావిన్సీ రిజల్యూషన్ వంటి టూల్స్ బెస్ట్ గా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo