Android ఫోన్‌ లో దాగి ఉన్న ఈ బెస్ట్ AI ఫీచర్లు చాలా మందికి తెలియదు.!

HIGHLIGHTS

ఇప్పటి Android ఫోన్‌ లు కేవలం కాల్స్ చేయడానికి లేదా సోషల్ మీడియా కోసం మాత్రమే కాదని తెలుసుకోండి

AI (Artificial Intelligence) ఫీచర్లు మన రోజువారీ పనులను మరింత సులభం చేస్తున్నాయి

మొబైల్ తయారీ కంపెనీలు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ లలో అనేక AI టూల్స్‌ ను నిశ్శబ్దంగా అందిస్తున్నాయి

Android ఫోన్‌ లో దాగి ఉన్న ఈ బెస్ట్ AI ఫీచర్లు చాలా మందికి తెలియదు.!

ఇప్పటి Android స్మార్ట్‌ ఫోన్‌ లు కేవలం కాల్స్ చేయడానికి లేదా సోషల్ మీడియా వినియోగం కోసం మాత్రమే కాదని తెలుసుకోండి. వాటిలో దాగి ఉన్న AI (Artificial Intelligence) ఫీచర్లు మన రోజువారీ పనులను మరింత సులభం చేస్తున్నాయి. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది యూజర్లకు ఈ స్మార్ట్ ఫీచర్ల గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఈరోజు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో దాగి ఉన్న బెస్ట్ AI ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Android Phone AI Features

గూగుల్, శాంసంగ్ , షియోమీ, వన్ ప్లస్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ లలో అనేక AI టూల్స్‌ ను నిశ్శబ్దంగా అందిస్తున్నాయి. వాటిలో కొన్ని మీ పని వేగాన్ని పెంచుతాయి. అయితే, మరికొన్ని టూల్స్ ఫోటోలు, బ్యాటరీ మరియు భద్రతను స్మార్ట్‌ గా నిర్వహిస్తాయి.

AI Call Screening

కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌ లలో AI ఆధారిత Call Screening ఫీచర్ ఉంటుంది. ఇది స్పామ్ కాల్స్‌ను గుర్తిస్తుంది మరియు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అంతేకాదు, కాల్ ఎందుకు వచ్చిందో స్క్రీన్‌ పైనే చూపిస్తుంది. ఈ ఫీచర్ ప్రత్యేకమైన ఫీచర్ Google Pixel ఫోన్లలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ తో స్పామ్ కాల్స్‌కు గుడ్‌బై చెప్పొచ్చు.

Magic Eraser

మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసర వ్యక్తులు లేదా వస్తువులు ఉన్నాయా? అయితే, AI ఆధారిత మ్యాజిక్ ఎరేజర్ వాటిని జస్ట్ వన్ టచ్ తో మాయం చేస్తుంది. ఈ ఫీచర్ తో ఫోటోల్లో అవసరం లేని వస్తువులు తొలగించండి. ఈ ఫీచర్ పిక్సెల్ ఫోన్స్ మరియు కొన్ని శాంసంగ్ ఫోన్స్ లో అందుబాటులో ఉంది. ఆఫ్ కోర్స్ ప్రస్తుతం కొత్తగా లాంచ్ అయిన చాలా ఫోన్స్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫోటో ఎడిటింగ్‌లో ఇది చిన్న ఫోటో షాప్ మాదిరిగా పనిచేస్తుంది.

Live Translate

AI ఇప్పుడు భాషా సమస్యలు కూడా తగ్గిస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇంగ్లీష్‌ లో వచ్చిన మెసేజ్‌ ను ఏఐ సహాయంతో వెంటనే తెలుగులో చదవవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కాల్స్, మెసేజెస్ మరియు చాట్స్ రియల్‌ టైమ్‌ లో అనువదించబడతాయి.

Android Phone AI Features

Adaptive Battery

ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ గురించి చాలా మందికి యూజర్లకు తెలియదు. ఈ ఫీచర్ తో ఏఐ యూజర్ ఫోన్ ను ఉపయోగించే తీరును గమనించి తక్కువగా వాడే Apps‌ ను పరిమితం చేస్తుంది. ఈ విధంగా ఫోన్ బ్యాటరీ సేవ్ చేస్తుంది మరియు బ్యాగ్రౌండ్ యాక్టివిటీ తగ్గిస్తుంది. దీంతో ఫోన్ ఎక్కువ సేపు పనిచేస్తుంది.

Also Read: జబర్దస్త్ సౌండ్ అందించే కొత్త 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ కారు చౌక ధరలో లభిస్తోంది.!

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో వచ్చిన అత్యంత పాపులర్ AI ఫీచర్ ఇదే అవుతుంది. ఈ ఫీచర్ తో స్క్రీన్‌ పై కనిపించే ఫోటో, టెక్స్ట్, ప్రోడక్ట్, వీడియోలోని అంశం ఏ విషయాన్నైనా జస్ట్ సర్కిల్ చేస్తే వెంటనే Google Search ఫలితాలు చూపిస్తుంది.

AI Voice Typing

టైప్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే AI Voice Typing చాలా ఉపయోగకరమైన ఫీచర్ అవుతుంది. ఎందుకంటే, మీరు మాట్లాడితే చాలు ఏఐ వేగంగా టెక్స్ట్ రాస్తుంది. ముఖ్యంగా ఇది అనేక భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా WhatsApp, Notes, Gmail లో బాగా ఉపయోగపడుతుంది.

Theft Detection Lock

ఇది యూజర్ ఫోన్ లో గొప్ప ఫీచర్ అవుతుంది మరియు ఫోన్ ను కాపాడుతుంది. కొత్త ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లలో ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఫోన్ అకస్మాత్తుగా లాక్కెళ్లినట్టుగా గుర్తిస్తే, ఫోన్ లో ఉన్న ఏఐ వెంటనే స్క్రీన్ లాక్ చేస్తుంది. అంతేకాదు, ఫోన్ లో ఉన్న డేటాను కూడా రక్షిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ భద్రతలో పెద్ద అడుగు అని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్‌ ను కేవలం సాధారణ డివైజ్ గా మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అందులో దాగి ఉన్న AI ఫీచర్లు తెలుసుకుంటే, అదే ఫోన్ మరింత స్మార్ట్‌ గా మారుతుంది. ముఖ్యంగా, Google మరియు Samsung వంటి కంపెనీలు AI ను ప్రతి యాప్‌ లోకి తీసుకువస్తున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile