Air Conditioner కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు.!

HIGHLIGHTS

Air Conditioner కొనే ముందు కొన్ని విషయాలు పరిశీలించాలి

మార్కెట్లో అనేక బ్రాండ్ మరియు మోడల్ అందుబాటులో ఉండటం తో సరైన ఏసీని ఎంచుకోవడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది

ఏసీ కొనుగోలు చేసే ముందు 10 అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

Air Conditioner కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు.!

వేసవి తీవ్రత ప్రతీ ఏడాదికి పెరుగుతోంది మరియు ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో చాలా మంది తమ ఇళ్లకు మరియు కార్యాలయాలకు Air Conditioner (AC) కొనుగోలు చేయడమే ఉత్తమం అని నిర్ణయించుకుంటున్నారు. అయితే, మార్కెట్లో అనేక బ్రాండ్ మరియు మోడల్ అందుబాటులో ఉండటం తో సరైన ఏసీని ఎంచుకోవడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. ముఖ్యంగా, కేవలం ధరలు చూసి ఏసీ కొనుగోలు చేస్తే తర్వాత విద్యుత్ బిల్లు, నిర్వహణ ఖర్చులు మరియు పెర్ఫార్మెన్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, ఏసీ కొనుగోలు చేసే ముందు ఈ 10 అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Air Conditioner : 10 ముఖ్యమైన విషయాలు

గది పరిమాణానికి సరిపోయే టన్ ఏసీ ఎంచుకోండి

గది పరిమాణానికి సరిపోయే టన్నేజ్ ఎంచుకోవడం మీరు మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం. చిన్న గదిలో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ లేదా పెద్ద గదిలోకి తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ కొనుగోలు చేస్తే విద్యుత్ వృథా అవుతుంది. సాధారణంగా 100-120 చదరపు అడుగుల గదికి 1 టన్ను, 150-180 చదరపు అడుగుల గదికి 1.5 టన్నుల ఏసీ సరిపోతుంది.

స్ప్లిట్ లేదా విండో ఏసీ

స్ప్లిట్ ఏసీలు తక్కువ శబ్దంతో పనిచేస్తాయి మరియు గదిలో ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. కానీ, విండో ఏసీలు తక్కువ ఖర్చుతో లభిస్తాయి కానీ శబ్దం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో స్ప్లిట్ ఏసీ లను తీసుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపుతున్నారు.

ఇన్వర్టర్ టెక్నాలజీ

ఇన్వర్టర్ ఏసీ అవసరానికి అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. దీంతో గది ఉష్ణోగ్రత ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుంది మరియు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అంటే, మీ కరెంట్ బిల్ కోసం మీరు చేసే ఖర్చు బాగా తగ్గుతుంది. దీర్ఘకాలికంగా చూసినప్పుడు ఇన్వర్టర్ AC ఉత్తమ ఎంపిక అవుతుంది.

స్టార్ రేటింగ్‌ ను తప్పనిసరిగా పరిశీలించండి

ఏసీ పై కనిపించే స్టార్ గుర్తు ఏసీ యొక్క విద్యుత్ సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఇందులో, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉంటాయి. ఇందులో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఏసీ ఉత్తమ ఎంపిక అవుతుంది. టాప్ రేటింగ్ ఏసీ తీసుకునేప్పుడు ఖర్చు కొంచెం ఎక్కువైనా, 5 స్టార్ ఏసీ మీ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గిస్తుంది.

Air Conditioner

విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయండి

ఏసీ కొనుగోలు కోసం కేవలం ధర మాత్రమే కాకుండా, నెలవారీ విద్యుత్ ఖర్చు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గంటలు ఏసీ ఉపయోగించే కుటుంబాలు విద్యుత్ సామర్థ్యం ఉన్న మోడల్‌ ను ఎంచుకోవడం మంచిది.

కాపర్ కాయిల్ లేదా అల్యూమినియం కాయిల్

ఏసీ లో ఉండే కాయిల్ ఏసీ లో ముఖ్యమైన పరికరం గా ఉంటుంది. వీటిలో కాపర్ కండెన్సర్ కాయిల్స్ ఉన్న ఏసీలు ఎక్కువగా సిఫార్సు చేయబడతాయి. ఎందుకంటే, కాపర్ కండెన్సర్ కాయిల్స్ కలిగిన ఏసీలు మెరుగైన కూలింగ్, తక్కువ నిర్వహణ ఖర్చు మరియు ఎక్కువ మన్నిక వంటి మంచి ఉపయోగాలు కలిగి ఉంటుంది.

ఎయిర్ ఫిల్టర్ ఫీచర్స్ పరిశీలించండి

ఆధునిక ఏసీ లలో అనేక ఆరోగ్యకరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎయిర్ ఫిల్టర్ ఫీచర్ ప్రత్యేకమైనది. పిల్లలు, వృద్ధులు లేదా అలర్జీ సమస్యలు ఉన్న కుటుంబాలకు ఇవి మంచి ఉపయోగకరంగా ఉంటాయి. PM 2.5 ఫిల్టర్, యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ మరియు డస్ట్ ఫిల్టర్ వంటి మరిన్ని ఫిల్టర్ ఆప్షన్స్ ఏసీ లలో అందుబాటులో ఉంటాయి.

Also Read: టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వ ఆంక్షలు.. ఘాటుగా స్పందించిన Telegram CEO పావెల్ డురోవ్.!

నోయిస్ లెవెల్ పరిశీలించండి

ఏసీ ఎంచుకోవడానికి నోయిస్ లెవల్ దృష్టిలో ఉంచుకోవడం కూడా అవసరం. ఎందుకంటే, అధిక సౌండ్ చేసే ఏసీ మీ ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. ప్రత్యేకించి బెడ్‌ రూమ్‌ కోసం ఏసీ కొనుగోలు చేస్తున్నప్పుడు శబ్ద స్థాయి చాలా ముఖ్యం. 20 నుంచి 40 డెసిబెల్స్ మధ్య శబ్దం ఉత్పత్తి చేసే ఏసీ లు నిశ్శబ్దంగా పనిచేస్తాయి మరియు మంచి నిద్రకు సహాయపడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile