Soundbar కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన 10 ఫీచర్లు ఇవే.!

HIGHLIGHTS

ఒకప్పుడు సినిమా థియేటర్ మాత్రమే ఏకైక సాధనం గా ఉండేది

మారిన కాలం మరియు టెక్నాలజీ తో ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు

సంగీతాన్ని మరింత అద్భుతంగా ఆస్వాదించాలంటే మంచి సౌండ్‌ బార్ ఒక గొప్ప ఎంపిక అవుతుంది

Soundbar కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన 10 ఫీచర్లు ఇవే.!

ఒకప్పుడు సినిమా థియేటర్ మాత్రమే ఏకైక సాధనం గా ఉండేది. అయితే, ఇప్పుడు మారిన కాలం మరియు టెక్నాలజీ తో ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే, కొత్త సినిమాలు సైతం OTT లో రిలీజ్ కావడం, పెద్ద స్మార్ట్ టీవీ లతో పాటు థియేటర్ అనుభూతిని అందించే సౌండ్ బార్ లు ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌ లు, స్పోర్ట్స్ లేదా సంగీతాన్ని మరింత అద్భుతంగా ఆస్వాదించాలంటే మంచి సౌండ్‌ బార్ ఒక గొప్ప ఎంపిక అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం మార్కెట్లో వందలాది మోడళ్లు అందుబాటులో ఉండటంతో సరైన సౌండ్‌ బార్‌ ను ఎంచుకోవడం కొంత కష్టంగా మారింది. అందుకే కొనుగోలు చేసే ముందు ఈ 10 ముఖ్యమైన ఫీచర్లను తప్పనిసరిగా పరిశీలించాలి.

Soundbar లో చెక్ చేయాల్సిన 10 ఫీచర్లు

ఛానల్ కాన్ఫిగరేషన్

సౌండ్ బార్ ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం కాన్ఫిగరేషన్. ఇందులో 2.0, 2.1, 3.1, 5.1 లేదా 7.1.2 వంటి ఛానల్ సెటప్‌ లు ఉంటాయి. ఎక్కువ ఛానల్స్ ఉంటే సరౌండ్ సౌండ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.

Dolby Atmos అండ్ DTS సపోర్ట్

Dolby Atmos అండ్ DTS సౌండ్ టెక్నాలజీలు 3D ఆడియో అనుభూతిని అందిస్తాయి. సినిమా థియేటర్ తరహా సౌండ్ ని మీరు పొందాలనుకుంటే ఇవి తప్పనిసరిగా ఉండాలి.

Soundbar with dolby atmos and dts x

పవర్ అవుట్‌ పుట్

సౌండ్ బార్ మోడల్ లో 100W నుంచి 1000W వరకు వివిధ మోడల్స్ ఉంటాయి. పెద్ద గదులకు అధిక పవర్ ఉన్న సౌండ్‌ బార్‌ లు అనుకూలంగా ఉంటాయి.

వైర్‌ లెస్ సబ్‌ ఉఫర్

డీప్ బాస్ కోసం ప్రత్యేక సబ్‌ ఉఫర్ చాలా ఉపయోగపడుతుంది. వైర్‌ లెస్ సబ్‌ ఉఫర్ ఉంటే సెటప్ కూడా సులభంగా ఉంటుంది. అంతేకాదు, వైర్ బెడద లేకుండా అనుకూలమైన ప్లేస్ లో సౌండ్ బార్ ను సెట్ చేసుకోవచ్చు.

HDMI eARC / ARC

టీవీతో అత్యుత్తమ ఆడియో కనెక్టివిటీ కోసం HDMI eARC లేదా ARC సపోర్ట్ ఉన్న మోడల్‌ ను ఎంచుకోవడం మంచిది.

బ్లూటూత్ అండ్ Wi-Fi కనెక్టివిటీ

స్మార్ట్‌ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌ టాప్ నుంచి నేరుగా ఆడియో ప్లే చేయడానికి బ్లూటూత్ అండ్ Wi-Fi కనెక్టివిటీ అవసరం అవుతాయి. అయితే, సాధారణంగా అన్ని సౌండ్ బార్ లలో బ్లూటూత్ కనెక్టివిటీ లభిస్తుంది. కానీ, ప్రీమియం సౌండ్ బార్స్ లో మాత్రమే Wi-Fi కనెక్టివిటీ లభిస్తుంది.

సౌండ్ మోడ్స్

సినిమా, మ్యూజిక్, న్యూస్, స్పోర్ట్స్, గేమ్ వంటి ప్రత్యేక సౌండ్ మోడ్స్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత గొప్పగా మారుస్తాయి.

వాయిస్ ఎన్‌హాన్స్‌మెంట్

సినిమాలు లేదా వార్తలు చూస్తున్నప్పుడు డైలాగ్‌ లు చాలా స్పష్టంగా వినిపించేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది.

Also Read: Lava Bold N2 5G: సింగల్ డే డిస్కౌంట్ ఆఫర్ తో లావా బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

డిజైన్ అండ్ సైజు

మీ టీవీ పరిమాణానికి సరిపోయే డిజైన్ మరియు వాల్ మౌంట్ సపోర్ట్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, పెద్ద టీవీ కోసం చిన్న బార్ తీసుకునే మీకు తగిన సౌండ్ లభించే అవకాశం తక్కువగా ఉంటుంది.

బ్రాండ్ అండ్ వారంటీ

నాణ్యమైన బ్రాండ్, మంచి సర్వీస్ నెట్‌ వర్క్ మరియు కనీసం 1 సంవత్సరం వారంటీ ఉన్న సౌండ్ బార్ మోడల్‌ ను ఎంచుకోవడం మంచిది. ఇది మీకు సౌండ్ బార్ కొన్న తర్వాత సర్వీస్ లో సమస్య రాకుండా ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ పాయింట్స్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే, సౌండ్‌ బార్ కొనుగోలు సమయంలో కేవలం ధరను మాత్రమే కాకుండా పై ఫీచర్లను కూడా పరిశీలిస్తే మీ అవసరాలకు సరిపోయే ఉత్తమ మోడల్‌ ను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా Dolby Atmos, HDMI eARC మరియు వైర్‌ లెస్ సబ్‌వూఫర్ వంటి ఫీచర్లు ఉన్న సౌండ్‌ బార్‌ లు హోమ్ ఎంటర్టైన్మెంట్ ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile