ఇంటర్నెట్ లేకుండా పనిచేసే ఉపయోగకరమైన Mobile Apps: ఇవి మీకు ఎంతో ఉపయోగం

HIGHLIGHTS

స్మార్ట్‌ ఫోన్లలోని చాలా యాప్‌ లు ఇంటర్నెట్‌ పై ఆధారపడి మాత్రమే పనిచేస్తున్నాయి

ఈ యాప్స్ మీ రోజువారీ జీవితంలో కూడా అద్భుతంగా సహాయ పడతాయి

కొన్ని యాప్‌ లు ఇంటర్నెట్ లేకుండానే మీకు ఎంతో ఉపయోగపడతాయి

ఇంటర్నెట్ లేకుండా పనిచేసే ఉపయోగకరమైన Mobile Apps: ఇవి మీకు ఎంతో ఉపయోగం

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లలోని చాలా యాప్‌ లు ఇంటర్నెట్‌ పై ఆధారపడి మాత్రమే పనిచేస్తున్నాయి. అయితే, ప్రయాణాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో లేదా నెట్‌ వర్క్ సరిగా అందుబాటులో లేని క్లిష్టమైన సమయంలో కొన్ని యాప్‌ లు ఇంటర్నెట్ లేకుండానే మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ యాప్స్ మీ రోజువారీ జీవితంలో కూడా అద్భుతంగా సహాయ పడతాయి. అలాంటి ఇంటర్నెట్ లేకుండా పనిచేసే ఉపయోగకరమైన Mobile Apps ని గురించి రోజు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Maps Offline

ఈ లిస్ట్ లో మొదటిగా వచ్చే గూగుల్ మ్యాప్స్ ఆఫ్ లైన్ యాప్. ప్రయాణాలకు వెళ్లే ముందు మ్యాప్‌ లను డౌన్‌ లోడ్ చేసుకుంటే గూగుల్ మ్యాప్ ను ఇంటర్నెట్ లేకుండానే ఉపయోగించవచ్చు. రోడ్స్, ప్రదేశాలు మరియు నావిగేషన్‌ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది.

Google Translate

మీరు ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ యాప్ మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. మనకు భాషలను అర్థం చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్లేట్ ఎంతో ఉపయోగపడుతుంది. అవసరమైన భాషా ప్యాక్‌ ను ముందుగానే డౌన్‌ లోడ్ చేసుకుంటే ఆఫ్‌ లైన్‌ లో కూడా మీరు మీకు అవసరమైన భాషలో ట్రాన్స్లేట్ చేయవచ్చు.

Spotify అండ్ YouTube Music

ప్రీమియం వినియోగదారులు తమకు ఇష్టమైన పాటలు, ప్లేలిస్ట్‌ లను ముందుగానే డౌన్‌ లోడ్ చేసుకుని ఇంటర్నెట్ లేకుండానే వినవచ్చు. అయితే, నార్మల్ యూజర్లకు ఈ అవకాశం ఉండదు. అయితే, యూట్యూబ్ వీడియోలను మాత్రం డౌన్లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా చూడొచ్చు.

Offline Mobile Apps

Kindle

పుస్తక ప్రియులకు ఈ కిండల్ యాప్ చాలా గొప్ప ఎంపిక అవుతుంది. ఒకసారి ఈ బుక్‌ ను డౌన్‌ లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ అవసరం లేకుండానే హాయిగా చదువుకోవచ్చు.

Notion అండ్ Evernote

నోట్స్ రాసుకోవడానికి, పనులను ప్లాన్ చేసుకోవడానికి ఈ యాప్‌ లు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆఫ్‌ లైన్‌ లో మార్పులు చేసినా తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి.

Adobe Scan

డాక్యుమెంట్లను స్కాన్ చేసి PDF రూపంలో సేవ్ చేయడానికి ఈ అడోబ్ స్కాన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేకున్నా ఈ యాప్ లో ఉండే స్కానింగ్ ఫీచర్ పనిచేస్తుంది. కాబట్టి, ఎప్పుడైనా ఎక్కడైనా డాక్యుమెంట్లను హ్యాపీగా స్కాన్ చేసి PDF రూపంలో సేవ్ చేసుకోవచ్చు.

Also Read: Pm Kisan Yojana: రైతులకు కేంద్రం కీలక అప్‌డేట్ .. అకౌంట్ లో డబ్బులు పడేది ఎప్పుడంటే.!

VLC Media Player

వీడియో మరియు ఆడియో ఫైళ్లను ప్లే చేయడానికి VLC మీడియా ప్లేయర్ అత్యంత ఉపయోగకరమైన యాప్. మరింత గొప్ప విషయం ఏమిటంటే ఇది పూర్తిగా ఆఫ్‌ లైన్‌ లో పనిచేస్తుంది. మీరు డౌన్ లోడ్ చేసుకున్న వీడియోలను మంచి రిజల్యూషన్ లో చూడటానికి ఇది సహాయం చేస్తుంది.

ఆఫ్‌ లైన్‌ యాప్స్ అవసరం ఏమిటి?

ఆఫ్‌ లైన్ యాప్‌ లు డేటా ఆదా చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడాగొప్పగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా, ప్రయాణాలు చేసే వారు, విద్యార్థులు మరియు ఉద్యోగులు ఈ యాప్‌ లను తమ ఫోన్‌ లో ఉంచుకోవడం మంచిది. ఈ యాప్స్ తో రోజు వారి జీవితంలో అవసరమైన పనులకు ఉపయోగమే కాకుండా టైం పాస్ కి కూడా ఉపయోగపడతాయి.

ఇక ఈ యాప్స్ ఆఫ్ లైన్ యాప్స్ గురించి మాటలో చెప్పాలంటే, ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయంలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ ను మరింత ఉపయోగకరంగా మార్చే శక్తి కలిగి ఉంటాయి ఈ ఆఫ్ లైన్ యాప్స్. వీటిలో మనం చర్చించిన యాప్స్ కాకుండా అనేక యాప్‌ లు ఉన్నాయి. Google Maps నుంచి Kindle వరకు ఈ యాప్‌ లు మీ రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile