ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లో జరిగే పనులను మరొక ఆండ్రాయిడ్ ఫోన్ లో చూడటానికి పనిచేసే యాప్

ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లో జరిగే పనులను మరొక ఆండ్రాయిడ్ ఫోన్ లో చూడటానికి పనిచేసే యాప్

మీకు తెలిసిన వాళ్లకు ఫోన్ లో ఏదైనా సెట్టింగ్ లేదా పనిని ఎలా చేయాలో చెప్పినా అర్థంకాని సందర్భాలు ఎదురుచూసే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మరింత క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పటానికి ఇప్పుడు ఒక యాప్ చూద్దాం రండి!

యాప్ పేరు Inkwire Screen Share. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో 4.4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. యాప్ సైజ్ 4.92 MB – 2G ఇంటర్నెట్ లో 5 నిముషాలు పడుతుంది డౌన్లోడ్ కు.

సో ముందుగా మీకు తెలియవలసిన విషయం ఈ యాప్ వాళ్ళ ఫోనులోకి వెళ్లి అవతల వ్యక్తికి బదులు మీరే ఆ పని/సెట్టింగ్ చేసేది కాదు. ఎలా చేయాలో మీరు, మీ ఫోన్ లో ప్రాక్టికల్ గా చేస్తుంటే అదే ప్రాక్టికల్ process వాళ్ళకు క్లియర్ గా కనపడుతుంది.

అంటే యాప్ పేరు లో చెప్పినట్లుగా మీరు ఆ పని చేస్తున్నప్పుడు మీ స్క్రీన్ ను వాళ్ళకు రికార్డ్ చేస్తూ ఇంటర్నెట్ సహాయతంలో అవతల వ్యక్తికి చూపిస్తుంది. ఎక్కడ టచ్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. మైక్రో ఫోన్ ద్వారా వాయిస్ కూడా పంపగలరు.

ఏలా వాడాలి?

యాప్ ఓపెన్ చేస్తే మీకు పైన  Share this android for another user to see అని ఉంటుంది. దీని క్రింద share అని ఒక బటన్ ఉంటుంది. దీనిపై మీరు టాప్ చేస్తే, మీ ఫోన్ లో మీరు చేసేది మరొక వ్యక్తికి చూపించటానికి పనిచేస్తుంది. ఇది ప్రెస్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది, దానిని అవతల వ్యక్తికి షేర్ చేస్తే, ఈ కోడ్ ను వాళ్ళ స్క్రీన్ లో ఎంటర్ చేసి మీ స్క్రీన్ ను కనెక్ట్ చూడగలుగుతారు.

యాప్ ఓపెన్ చేసిన వెంటనే క్రింద మరొక బటన్ (ACCESS) ఉంటుంది. దీని పై టాప్ చేస్తే అవతల వ్యక్తి ఆల్రెడీ షేర్ చేసి మీకు వాళ్ళ స్క్రీన్ ను షేర్ చేస్తే, దానిని చూడటానికి పనిచేస్తుంది. సో వాళ్ళ చేసే ప్రోసెస్ ను ఈ బటన్ ద్వారా చూసి, మీ ఫోన్ లో ట్రై చేసుకోగలరు ఇక.

మైనస్?
ఇది కేవలం స్క్రీన్ షేరింగ్ మాత్రమే చేస్తుంది కాని అవతల వ్యక్తి ఫోనులోకి వెళ్లి వాళ్ళకు చేయటం రాని పనులను మీరు చేసేలా use అవ్వదు. అంటే ఇంట్లోని పెద్దవాళ్ళకు లేదా పేరెంట్స్ కు పిల్లలు దూరం నుండి స్క్రీన్ షేర్ ద్వారా ప్రాసెస్ తెలిపే ప్రయత్నం చేసినా, వాళ్ళకు అర్థమవటం అనేది తక్కువ శాతం.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo