Poco X8 launching with new look and new features
Poco X8: పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చేపట్టిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ఫీచర్స్ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ న్యూ లుక్ అండ్ న్యూ ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు భారీగా టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా పోకో కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 4న ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ x ప్లాట్ ఫామ్ ద్వారా టీజింగ్ చేయబడుతోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేసింది.
పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం లుక్స్ కలిగిన సరికొత్త డిజైన్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్ మరియు మెటల్ కెమెరా బంప్ కలిగి ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే అనిపిస్తుంది. అయితే, ఈ ఫీచర్ పై పోకో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోన్ రౌండ్ కార్నర్స్ మరియు స్లీక్ డిజైన్ తో ఆకట్టుకునే రూపంలో ఉంటుంది.
డిస్ప్లే పరంగా, ఈ ఫోన్ లో బిగ్ అండ్ అందించింది. ఇందులో 6.83 ఇంచ్ పరిమాణం కలిగిన పెద్ద 12 బిట్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు వెట్ టచ్ డిస్ప్లే 2.0 ఫీచర్ తో ఉంటుంది.
ఇవి కాకుండా ఈ ఫోన్ లో HDR 10+ సపోర్ట్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ వంటి ప్రీమియం డిస్ప్లే ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ లెవల్ విజువల్స్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. అంత ప్రీమియం డిస్ప్లే కోసం రక్షణ ఇచ్చే గ్లాస్ కూడా ప్రీమియం గానే ఉండాలి కదా. అందుకే, ఈ ఫోన్ స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందించింది. ఈ ఫోన్ 3 మీటర్ డ్రాప్ టెస్ట్ లో SGS 5 స్టార్ సర్టిఫికేషన్ అందుకున్నట్లు కూడా పోకో తెలిపింది.
Also Read: మార్కెట్లో దిగిన కొత్త బడ్జెట్ ఫోన్ BOLTT ACE 5G ఫస్ట్ సేల్ డేట్ వచ్చేసింది.!
ఈ ఫోన్ ను 6 కంటే ఎక్కువ సంవత్సరాల బ్యాటరీ హెల్త్ కలిగిన 9000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా వస్తుంది.