flipkart offers huge bank discount offer on xiaomi Smart Tv
లేటెస్ట్ Xiaomi Smart Tv పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సూపర్ డిస్కౌంట్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ దెబ్బకి షియోమీ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 43 ఇంచ్ అలెక్సా స్మార్ట్ టీవీ కేవలం 21 వేల రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఫ్రీడమ్ సేల్ నుంచి లభించిన ఆఫర్ ధర కంటే కూడా ఈ రోజు ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో లభిస్తుంది.
షియోమీ యొక్క ఫెంటాస్టిక్ సిరీస్ నుంచి ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈ రోజు రూ. 25,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ లిస్ట్ అవుట్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించడం ద్వారా ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరలో అందుకునే అవకాశం అందించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై రూ. 4,200 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 21,799 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై రూ. 3,750 డిస్కౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI అండ్ ఫ్లిప్ కార్ట్ Axis క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పైన కూడా రూ. 3,913 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
Also Read: ఇంటిని థియేటర్ గా మార్చే Sony Dolby సౌండ్ బార్ పై అద్భుతమైన ఆఫర్.!
ఈ షియోమీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. ఈ టీవీ ప్రీమియం బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు బిల్ట్ ఇన్ అలెక్సా సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, వైడ్ కలర్ గామూట్ మరియు ఫిలిమ్ మేకర్ మోడ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈటీవీ రెండు బాక్స్ స్పీకర్లు కలిగి టోటల్ 24W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. షియోమీ ఈ టీవీలో డాల్బీ ఆడియో, డీటీఎస్ మరియు డీటీఎస్ X వర్చువల్ సౌండ్ సపోర్ట్ ని అందించింది. ఈ టీవీ బిల్ట్ ఇన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్, HDMI, AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.