మార్కెట్లో దిగిన కొత్త బడ్జెట్ ఫోన్ BOLTT ACE 5G ఫస్ట్ సేల్ డేట్ వచ్చేసింది.!

HIGHLIGHTS

BOLTT ACE 5G ఆకట్టుకునే బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ చాలా చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

బోల్ట్ ఈ ఫోన్ ను 6.79 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది

ప్రముఖ వేరబుల్ డిజైన్ ప్రొడక్ట్స్ కంపెనీ ఫైర్ బోల్ట్ సబ్ బ్రాండ్ బోల్ట్ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే BOLTT ACE 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఆకట్టుకునే బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ చాలా చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది. ఈ ఫోన్ సేల్ కంటే ముందే ఈ కొత్త ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఓరకంట చూద్దాం.

BOLTT ACE 5G: ప్రైస్

బోల్ట్ అందించిన ఈ బ్రాండ్ న్యూ 5జి ఫోన్ మొత్తం మూడు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎంపికలో లభిస్తుంది. ఈ ఫోన్ బేసిక్ 4GB + 64GB వేరియంట్ రూ. 12,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ రూ. 13,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.

ఆఫర్

ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రెండు బెస్ట్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 12,349 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.

Also Read: Redmi 17 5G: బిగ్ బ్యాటరీ అండ్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

BOLTT ACE 5G: ఫీచర్స్

బోల్ట్ ఈ ఫోన్ ను 6.79 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్క్రీన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. బోల్ట్ ఈ ఫోన్ ని Unisoc T8200 చిప్ సెట్ తో జతగా 8GB ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ ను ఆండ్రాయిడ్ 16 OS తో అందించింది.

ఈ ఫోన్ లో 64MP మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ FHD వీడియో సపోర్ట్ మరియు మంచి ఏఐ వీడియో ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ లో బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ, ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :