OPPO K13x 5G భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదలయ్యింది.!
ఒప్పో కె 13 సిరీస్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది
ఈ ఫోన్ ను గొప్ప రక్షణ అందించే ఆర్మర్ బాడీ, బిగ్ బ్యాటరీ మరియు ఒప్పో AI సపోర్ట్ తో లాంచ్ చేసింది
OPPO K13x 5G: ఒప్పో కె 13 సిరీస్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను గొప్ప రక్షణ అందించే ఆర్మర్ బాడీ, బిగ్ బ్యాటరీ మరియు ఒప్పో AI సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఒప్పో మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ విపులంగా తెలుసుకుందామా.
SurveyOPPO K13x 5G: ప్రైస్
ఒప్పో ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ (4GB + 128GB) వేరియంట్ ని రూ.11,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 12999 రూపాయల ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ వివో అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్లు
ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై సింగిల్ డే డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, రూ. 1,000 రూపాయల సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ తో రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం 27వ తేదీ ఫస్ట్ సేల్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
OPPO K13x 5G: ఫీచర్స్
ఒప్పో ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించిందని స్పెక్స్ షీట్ ప్రకారం చెప్పే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ 360 డిగ్రీల ఆర్మర్ బాడీ తో మిలటరీ గ్రేడ్ రక్షణతో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను IP65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో కూడా అందించింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ HD ప్లస్ స్క్రీన్ ఉంటుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఒప్పో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50MP మెయిన్, 2MP మ్యాక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ఒప్పో AI సపోర్ట్ తో ఈ ఫోన్ లో చాలా AI ఫీచర్స్ ఉన్నాయి.
Also Read: Ai Plus Smartphone డిటైల్స్ విడుదల చేసిన కంపెనీ.. ఫోన్ ఎలా ఉందంటే.!
ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ ను భారీ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాటరీ 5 సంవత్సరాల మన్నిక కలిగిన గొప్ప బ్యాటరీ అని ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా కొద చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.