Samsung Galaxy M36 5G ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన శామ్సంగ్.!
శామ్సంగ్ M సిరీస్ ను మరింత విస్తరిస్తోంది శామ్సంగ్
ఈ సిరీస్ నుంచి అప్ కమింగ్ ఫోన్ లాంచ్ చేయడానికి ఇప్పుడు శామ్సంగ్ సిద్దమయ్యింది
Samsung Galaxy M36 5G ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తోంది
Samsung Galaxy M36 5G: శామ్సంగ్ M సిరీస్ ను మరింత విస్తరిస్తోంది శామ్సంగ్. ఈ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి ఇప్పుడు శామ్సంగ్ సిద్దమయ్యింది. అదే శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తోంది. మరి శామ్ సంగ్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.
SurveySamsung Galaxy M36 5G
20 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో అందించిన శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను శామ్సంగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయడానికి టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Samsung Galaxy M36 5G : ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు బయటకు వెల్లడయ్యాయి. ఇందులో ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ వంటి వివరాలు ఉన్నాయి. టీజర్ ఇమేజ్ ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ తో అందిస్తున్నట్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి : అంచనా స్పెక్స్
ఇప్పటి వరకు శామ్సంగ్ అందించిన వివరాలు మాత్రమే మనం చూశాము. అయితే, ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ చూడనున్నారు. శామ్సంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ యొక్క సొంత చిప్ సెట్ Exynos లేటెస్ట్ 5G చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో 6000 లేదా అంతకు మించి పెద్ద బ్యాటరీ మరియు శామ్సంగ్ ఫోన్లలో రెగ్యులర్ గా అందించే 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించే అవకాశం ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ ఫోన్ లో FHD+ రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: OnePlus Nord 5: స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ చిప్సెట్ తో లాంచ్ అవుతోంది.!
అయితే, ఇవన్నీ కూడా గత జెనరేషన్ ఫోన్ ను దృష్టిలో ఉంచుకొని అందించిన అంచనా స్పెక్స్ గా గమనించాలి. ఇప్పటివరకు ఈ ఫోన్ స్పెక్స్ గురించి శామ్సంగ్ అఫీషియల్ గా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ కీలకమైన వివరాలు శామ్సంగ్ త్వరలోనే వెల్లడిస్తుందని భావిస్తున్నారు.