Poco F7: పోకో అప్ కమింగ్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన పోకో.!

HIGHLIGHTS

Poco F Series నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది

పోకో ఎఫ్ 6 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు పోకో టీజింగ్

ఈ ఫోన్ గురించి అంచనా స్పెక్స్ మరియు ఇతర వివరాలు షేర్ చేస్తున్నారు

Poco F7: పోకో అప్ కమింగ్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన పోకో.!

Poco F7: పోకో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన F Series నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. గత సంవత్సరం పోకో అందించిన పోకో ఎఫ్ 6 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా అప్ కమింగ్ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు పోకో టీజింగ్ మొదలు పెట్టింది ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు లాంచ్ చేసిన అన్ని ఫోన్స్ మరియు వాటి ప్రత్యేకతలు కొనియాడుతూ రాబోయే ఫోన్ ఇంతకంటే మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని హింట్ ఇస్తూ, పోకో అప్ కమింగ్ ఫోన్ టీజింగ్ స్టార్ట్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco F7 : టీజర్

పోకో అప్ కమింగ్ కోసం Coming Soon ట్యాగ్ లైన్ తో టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పేరు లేదా ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటికే నెట్టింట్లో రూమర్లు మొదలయ్యాయి. X ప్లాట్ ఫామ్ సాక్షిగా ప్రముఖ టిప్స్టర్స్ ఈ ఫోన్ గురించి అంచనా స్పెక్స్ మరియు ఇతర వివరాలు షేర్ చేస్తున్నారు.

Poco F7

వాస్తవానికి, గత వారమే గ్లోబల్ మార్కెట్ లో పోకో F సిరీస్ నుంచి పోకో ఎఫ్ 7 ప్రో మరియు పోకో ఎఫ్ 7 అల్ట్రా రెండు ఫోన్లు విడుదల చేసింది. ఈ ఫోన్ లలో ఒక ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, ప్రస్తుతం ఇండియాలో షియోమీ ఎదుర్కొంటున్న సమయంలో షియోమీ ఇండియాలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసే రిస్క్ తీసుకోదని బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే పోకో ఎఫ్ 7 జి స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో డెబ్యూ లాంచ్ సహజ అవకాశం ఉంది.

ఇప్పుడు ఈ వాదానికి ఊతమిచ్చేలా ప్రముఖ టిప్స్టర్ సంజయ్ చౌదరి పోకో అప్ ఫోన్ కోసం అందించిన ట్వీట్ నిలిచింది. అదేమిటంటే, పోకో త్వరలో పోకో ఎఫ్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తుందని తను X అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. ఇందులో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ఫీచర్స్ కూడా పేర్కొన్నారు.

Also Reda: iQOO Z10 Lite: భారీ బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించిన ఐకూ.!

Poco F7 : అంచనా ఫీచర్స్

అనేక రూమర్లు మరియు నిపుణుల అంచనా ప్రకారం, పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen సిరీస్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Gen 4 తో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా, 1.5K రిజల్యూషన్ AMOLED స్క్రీన్ మరియు అతి పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ ఉండే అవకాశం ఉందని అంచనా వేసి చెబుతున్నారు.

అయితే, ఈ ఫోన్ గురించి పోకో ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు లేదా విషయాలు బయటపెట్టలేదు. కాబట్టి ఈ ఫోన్ గురించి కంపెనీ అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo