Demis Hassabis: నోబెల్ గ్రహీత మరియు గూగుల్ డీప్ మైండ్ CEO అయిన డెమిస్ హస్సాబిస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగాలు మరియు దీనితో కలిగే ఉపయోగాలు వెల్లడించారు. ముఖ్యంగా, ప్రస్తుతం తాను ఒక స్టూడెంట్ గా ఉంటే ఎటువంటి కోర్స్ లేదా చదువు ఎంచుకుంటారో అనే విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. సోమవారం SXSW లండన్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. తనకు ప్రస్తుత కాలం స్టూడెంట్ గా ఉంటే STEM సబ్ కి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
Survey
✅ Thank you for completing the survey!
Demis Hassabis:
AI ఎంత అభివృద్ధి చెందినా కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తి పట్టు సాధించలేదని ఆయన తెలిపారు. ఇందులో STEM సబ్జక్ట్స్ ముఖ్యమైనవి అని కూడా ఆయన సూచించారు. అంటే, S (సైన్స్), T (టెక్నాలజీ), E (ఇంజనీరింగ్) మరియు M (మేథమేటిక్స్) ఉంటాయి. ముఖ్యంగా, మేథమెటికల్ మరియు సైంటిఫిక్ ఫండమెంటల్స్ ను AI పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత అభివృద్ధి చెడినా కూడా సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం కష్టతరం కావచ్చని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న నవీన యుగంలో AI తో పాటు కొనసాగాలని మరియు స్టూడెంట్ స్థాయి నుంచే AI టూల్స్ తో స్టూడెంట్స్ మరింత మెరుగు పడాలి అని కూడా చెప్పుకొచ్చారు. కంప్యూటర్ రంగంలో కూడా నేర్పు మరియు మంచి మెళకువ కలిగిన ఫైన్ స్కిల్డ్ స్టూడెంట్స్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
రానున్న ఐదు నుంచి పది సంవత్సరాలలో కలగబోయే పరిణామాల గురించి కూడా తన ఊహ కనుగుణంగా భవిష్యవాణి చెప్పారు. రానున్న రోజుల్లో కొత్త రకమైన (వేరియబుల్) జాబ్స్ ను AI క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని ఆయన తన ఆలోచనలు బయటపెట్టారు.
చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయ ఎడ్యుకేషన్ పరిధి దాటుకొని కటింగ్ ఎడ్జ్ AI సిస్టం పై ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ ను స్టూడెంట్స్ సాధించాలని ఆయన సూచించారు. AI సక్రమైన మార్గంలో నిర్వహించడం మరియు సులభంగా ఉపయోగించడం వంటి వాటిపై పట్టు సాధించిన స్టూడెంట్స్ కి మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే మార్గం ఉండవచ్చని ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.