Tecno Pova Curve 5G : చవక ధరలో ఫాస్ట్ ప్రోసెసర్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో వచ్చింది.!

HIGHLIGHTS

టెక్నో పోవా సిరీస్ నుంచి ఈరోజు ఇండియాలో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది

Tecno Pova Curve 5G టెక్నో తెచ్చిన కొత్త ఫోన్

ఫాస్ట్ ప్రోసెసర్ మరియు కర్వుడ్ స్క్రీన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్

టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది

ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి కేవలం 7.54mm మందం కలిగి చాలా స్లీక్ గా ఉంటుంది

Tecno Pova Curve 5G : చవక ధరలో ఫాస్ట్ ప్రోసెసర్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో వచ్చింది.!

Tecno Pova Curve 5G : టెక్నో పోవా సిరీస్ నుంచి ఈరోజు ఇండియాలో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. అదే టెక్నో పోవా కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్. ఈ లేటెస్ట్ ఫోన్ చవక ధరలో ఫాస్ట్ ప్రోసెసర్ మరియు కర్వుడ్ స్క్రీన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఇక్కడ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Pova Curve 5G : ప్రైస్

Tecno Pova Curve 5G Price

టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఇందులో 6 జీబీ వేరియంట్ ను రూ. 15,999 ధరతో మరియు 8 జీబీ వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గీక్ బ్లాక్, మ్యూజిక్ సిల్వర్ మరియు నియాన్ సియాన్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. జూన్ 5వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది.

Tecno Pova Curve 5G : ఫీచర్స్

టెక్నో పోవా కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి కేవలం 7.54mm మందం కలిగి చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అన్ని భాషలకు AI సపోర్ట్ కలిగిన సెగ్మెంట్ ఫస్ట్ ఫోన్ అవుతుంది మరియు ఇది Ella AI సపోర్ట్ తో వస్తుంది.

Tecno Pova Curve 5G

పోవా కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Ultimate చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో, 6 జీబీ / 8 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వరకు అదనపు ర్యామ్ ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను త్వరగా చల్లబరచడానికి వీలుగా 11 లేయర్స్ తో హైపర్ లేయర్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా టెక్నో ఈ ఫోన్ లో అందించింది.

Also Read: Acer Super ZX 5G బడ్జెట్ ఫోన్ గొప్ప తగ్గింపు ఆఫర్ తో సేల్ అవుతోంది.!

కెమెరా పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో, 64MP (Sony IMX682) మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo