Google I/O 2025: గూగుల్ మీట్ లో అద్భుతమైన ఫీచర్ జత చేసిన గూగుల్.!

HIGHLIGHTS

గూగుల్ నిన్న నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి కొత్త అప్డేట్స్ రిలీజ్ చేసింది

గూగుల్ మీట్ లో జత చేసిన కొత్త ఫీచర్ గొప్పగా ఆకట్టుకుంటుంది

ఇప్పటి వరకు ఫ్లాట్ గా ఉన్న స్పీచ్ ట్రాన్స్ లేషన్ ను మరింత విస్తరించింది

Google I/O 2025: గూగుల్ మీట్ లో అద్భుతమైన ఫీచర్ జత చేసిన గూగుల్.!

Google I/O 2025: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ నిన్న నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి కొత్త అప్డేట్స్ రిలీజ్ చేసింది. ఇందులో గూగుల్ మీట్ లో జత చేసిన కొత్త ఫీచర్ గొప్పగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఫ్లాట్ గా ఉన్న స్పీచ్ ట్రాన్స్ లేషన్ ను మరింత విస్తరించింది. అదేమిటంటే, గూగుల్ కొత్తగా అందించిన రియల్ టైం AI స్పీచ్. ఇది ఇప్పుడు యూజర్ వాయిస్ మరియు టోన్ ను కూడా అనుకరించి తర్జుమా చేసి వినిపిస్తుంది. అంటే, యూజర్ యొక్క ఇంటరాక్షన్ ను మరింత అనుకూలంగా మారుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google I/O 2025:

గూగుల్ కొత్తగా పరిచయం చేసిన ఈ రియల్ టైం AI స్పీచ్ ను ఈరోజు నుంచే అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. అయితే, ఇది ప్రస్తుతం AI Pro మరియు అల్ట్రా సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ తో గూగుల్ మీట్ తో నిర్వహించే వీడియో కాల్ సమయంలో యూజర్ మాటలు ఎదుటి వ్యక్తి కోరుకునే భాషలో తర్జుమా చేసి వారు కోరుకునే భాషలో వినిపిస్తుంది.

ఈ పని చేయడానికి గూగుల్ మీట్ లో కొత్తగా జతచేసిన జనరేటివ్ AI సహాయం చేస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే, AI యూజర్ వాయిస్ ను గుర్తించి అదే వాయిస్ మరియు టోన్ లో ఎదుటి వక్తికి తర్జుమా చేసి వినిపిస్తుంది. అంటే, కోపంగా చెబితే, కోపంగా లేదా బాధగా చెబితే బాధగా, ఇలా ఫీలింగ్ ను వినిపిస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంగ్లీష్ మరియు స్పానిష్ రెండు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో ఇటాలియన్, జర్మన్ మరియు పోర్చుగీస్ లో కూడా అందుబాటులోకి వస్తుంది.

Also Read: Nothing Phone (3) ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్.!

Google I/O 2025:

గూగుల్ నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం నుంచి ఈ టెక్నాలజీ ఏ విధంగా పని చేస్తుందో కూడా డెమో చూపించింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఇంగ్లీష్ లో మాట్లాడే యూజర్ స్పానిష్ లో మాట్లాడే తన సహోద్యోగితో ఏ విధంగా మాటలు కొనసాగించారో చూపించింది. యూజర్ ఇంగ్లీష్ లో మాట్లాడిన మాటలు స్పానిష్ భాషలో తర్జుమా చేసి అదే టోన్ లో రియల్ టైం లో అందించింది. ఈ వీడియో కాన్వర్జేషన్ నిజంగా గొప్పగా అనిపించింది. ఈ ఫీచర్ కనుక అన్ని భాషల్లో అందరికీ అందుబాటులోకి వస్తే, ప్రపంచంలో ఎవరితోనైనా అలవోకగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

గూగుల్ ఇప్పటి వరకు అందించిన ఫ్లాట్ మోనోటోన్ వాయిస్ మరియు తర్జుమా తో పోలిస్తే, ఈ కొత్త మల్టీ లింగ్వల్ ట్రాన్స్ లేషన్ మరింత సౌకర్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం కేవలం పైడ్ యూజర్స్ మాత్రమే ఆస్వాదించ గలుగుతారు. ఈ ఫీచర్ ఫ్రీ టైర్ యూజర్స్ కి ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రమే వెల్లడించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo