భారీ డిస్కౌంట్ తో కేవలం 23 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart Tv.!
ఈరోజు అతి భారీ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది
55 ఇంచ్ 4K Smart Tv కేవలం 23 వేల రూపాయల బడ్జెట్ దరలో లభిస్తోంది
కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు
కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే, ఈరోజు అతి భారీ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది. ఒక బ్రాండెడ్ 55 ఇంచ్ 4K Smart Tv ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 23 వేల రూపాయల బడ్జెట్ దరలో లభిస్తోంది. అంటే, కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఆ అతి భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో చూద్దాం పదండి.
Surveyఏమిటా 55 ఇంచ్ 4K Smart Tv ఆఫర్?
భారత్ లో మంచి స్మార్ట్ టీవీ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న TCL యొక్క సబ్ బ్రాండ్ iFFALCON యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. iFF55U64 మోడల్ నెంబర్ కలిగిన ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 64% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.
ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి Federal క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 23,499 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చు.
Also Read: Samsung Galaxy M06 5G: బడ్జెట్ ధరలో ఆల్ రౌండ్ ఫీచర్స్ తో వచ్చింది.!
iFFALCON 55 inch 4K Smart Tv: ఫీచర్స్
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ కేవలం 270 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే కలిగి ఉంటుంది. అంటే, లైట్ ఎక్కువగా ఉండే ఏరియాలో ఈ టీవీ విజువల్స్ కొంచెం డల్ గా కనిపిస్తాయి.

ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ లో 24W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉంటాయి. ఇందులో HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.