Samsung Galaxy M06 5G స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరలో ఈరోజు శామ్సంగ్ విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను M సిరీస్ లో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో చూడముచ్చటగా కనిపిస్తోంది. అంతేకాదు, ఫాస్ట్ ప్రోసెసర్, లాంగ్ బ్యాటరీ మరియు స్టన్నింగ్ కెమెరా సెటప్ వంటి అన్ని ఫీచర్స్ తో కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ లో లాంచ్ అయ్యింది.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy M06 5G: ధర
శామ్సంగ్ గెలాక్సీ M06 ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 9,499 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించింది. మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా కంపెనీ అందించింది. అమెజాన్, samsung.com మరియు అధీకృత రిటైల్ స్టోర్స్ నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది.
శామ్సంగ్ గెలాక్సీ M06 ఫోన్ మంచి స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు సేజ్ గ్రీన్ మరియు బ్లేజింగ్ బ్లాక్ రెండు కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ బిగ్ HD+ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో శామ్సంగ్ ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 2MP డెప్త్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ శామ్సంగ్ బడ్జెట్ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ను 25W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీతో అందించింది.
ఈ లేటెస్ట్ శామ్సంగ్ బడ్జెట్ ఫోన్ 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ తో పాటు 4 జెనరేషన్ OS అప్గ్రేడ్స్ అందుకుంటుంది. గెలాక్సీ M06 ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్విక్ షేర్ మరియు వాయిస్ ఫోకస్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.