Samsung Galaxy F06 5G: బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ ద్వారా తెలియ చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ అప్ కమింగ్ శామ్సంగ్ బడ్జెట్ 5G ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో పాటు ఈ ఫోన్ టీజింగ్ ప్రైస్ ను కూడా లాంచ్ కంటే ముందే వెల్లడించింది.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy F06 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ‘సబ్ కా హై జీ ఇండియా కా అప్నా 5జి’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది. శామ్సంగ్ ప్రకారం, అన్ని ఆఫర్స్ కలిపి ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ కేవలం రూ. 9,XXX ఆఫర్ ధరకే అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ యొక్క దాదాపు అన్ని కీలకమైన ఫీచర్స్ ముందే వెల్లడించింది. గెలాక్సీ ఎఫ్ 06 ఫోన్ ను 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.74 ఇంచ్ HD+ బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 2MP డెప్త్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను 4 Gen OS అప్గ్రేడ్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది.