New Earbuds: మార్కెట్ లో కొత్త High-Bass ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన Unix.!

HIGHLIGHTS

Unix ఈరోజు కొత్త High-Bass ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది

గొప్ప సౌండ్ అందించే ఫీచర్స్ తో ఈ కొత్త బడ్స్ ను లాంచ్ చేసినట్లు యూనిక్స్ పేర్కొంది

ఈ కొత్త బడ్స్ ను వెయ్యి రూపాయల కంటే తక్కువ ఆ ధరలో విడుదల చేసింది

New Earbuds: మార్కెట్ లో కొత్త High-Bass ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన Unix.!

New Earbuds: ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ Unix ఈరోజు కొత్త High-Bass ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. లీనమయ్యే గొప్ప సౌండ్ అందించే ఫీచర్స్ తో ఈ కొత్త బడ్స్ ను లాంచ్ చేసినట్లు యూనిక్స్ పేర్కొంది. ACRO (UX-HP20) పేరుతో మరియు మోడల్ నెంబర్ తో ఈ కొత్త బడ్స్ ను విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను వెయ్యి రూపాయల కంటే తక్కువ ఆ ధరలో విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ACRO New Earbuds : ప్రైస్

ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 999 రూపాయల ప్రైస్ తో మార్కెట్ లో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ బ్లాక్ మరియు వైడ్ రెండు కలర్స్ లో అందించింది. ఈ బడ్స్ యూనిక్స్ అధికారిక సైట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుండి లభిస్తుంది.

Also Read: జపాన్ ఫేమస్ బ్రాండ్ JVC లేటెస్ట్ QLED Smart tv అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

Unix ACRO (UX-HP20): ఫీచర్స్

యూనిక్స్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ బడ్స్ 13 mm స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో ఉన్న పెద్ద స్పీకర్లు గొప్ప లీనమయ్యే మరియు హై-బాస్ సౌండ్ అందిస్తాయని యూనిక్స్ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ టోటల్ 40 గంటల ప్లేబ్యాక్ అందించే పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. అదే స్టాండ్ బై లో అయితే ఈ బడ్స్ ఏకంగా 2000 గంటలు నిలుస్తుంది.

UNiX ACRO New Earbuds

యూనిక్స్ యాక్రో ఇయర్ బడ్స్ 12 మీటర్ల రేంజ్ వరకు కనెక్టివిటీ అందుకుంటుంది మరియు బ్లూ టూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ కొత్త బడ్స్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు బాక్స్ తో అందించింది. ఈ బడ్స్ కంఫర్ట్ ఫీల్ అందించే మంచి డిజైన్ ఈ బడ్స్ ను అందించినట్లు కూడా యూనిక్స్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo