క్వాడ్ 50MP స్టన్నింగ్ కెమెరా సిస్టంతో లాంచ్ అవుతున్న Oppo Find X8 Series

HIGHLIGHTS

Oppo Find X8 Series నుంచి కొత్త ఫోన్ లను ఒప్పో అనౌన్స్ చేసింది

ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది

50MP పవర్ ఫుల్ కెమెరా సిస్టంతో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పుడు కంపెనీ అనౌన్స్ చేసింది

క్వాడ్ 50MP స్టన్నింగ్ కెమెరా సిస్టంతో లాంచ్ అవుతున్న Oppo Find X8 Series

Oppo Find X8 Series నుంచి కొత్త ఫోన్ లను అనౌన్స్ ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ సిరీస్ ఫోన్ లను నాలుగు 50MP పవర్ ఫుల్ కెమెరా సిస్టంతో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పుడు కంపెనీ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్ ను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Find X8 Series : ఫీచర్స్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ నుంచి Find X8 మరియు Find X8 pro రెండు ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్స్ యొక్క డిస్ప్ల, కెమెరా సెటప్, డిజైన్ మరియు మరిన్ని ఇతర వివరాలు ఒప్పో బయట పెట్టింది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ ఫోన్ లలో వెనుక 50MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇందులో 50MP మెయిన్, 50MP (3x పెరిస్కోప్) 50MP (6x పెరిస్కోప్) మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ కెమెరా సెటప్ ను HASSELBLAD సపోర్ట్ జతగా కలిగి వుంది. 

Oppo Find X8 Series

ఒప్పో ఈ కొత్త ఫోన్ లను అతి తక్కువ అంచులు కలిగిన ఎడ్జ్ టూ ఎడ్జ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 6.78 ఇంచ్ సైజు లో గొప్ప బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకమైన అలర్ట్ స్లయిడర్ ఉంటుంది. ఈ ఫోన్ లో 5910 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని 80W సూపర్ ఫాస్ట్ వైర్డ్ చార్జర్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Happy Children’s Day సందర్భంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.!

ఈ ఫోన్ ను ను పెర్ల్ వైట్ మరియు స్పేస్ బ్లాక్ రెండు కలర్స్ లో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఒప్పో ఈ ఫోన్ ను నవంబర్ 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo