Jio Down: జియో నెట్వర్క్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్ల గగ్గోలు.!
Jio Down: దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్ల గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు, జియో నెట్వర్క్ డౌన్ అయినట్లు తెలియపరిచే స్క్రీన్ షాట్ లతో సోషల్ మీడియాని నింపుతున్నారు. కొత్త కొత్త మీమ్స్ మరియు రియాక్షన్స్ తో జియో యూజర్లు సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే పెరిగిన టారిఫ్ రేట్ లతో విసుగెత్తిన యూజర్లు సందట్లో సడేమియా అంటూ తిట్ల పురాణం అందుకుంటున్నారు.
Surveyఈరోజు అనగా సెప్టెంబర్ 17 వ తేదీ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అనేక చోట్ల జియో నెట్ వర్క్ డౌన్ అయినట్లు గుర్తించారు. దాదాపు 10,372 మంది యూజర్లు ఈ విషయంగా కంప్లైంట్ చేయడమే కాకుండా మిమ్స్ కూడా పెడుతున్నారు.
Mumbaikars please update status of your Jio network 😢 #Jiodown ? pic.twitter.com/tQGtCq3PdN
— Miss Ordinaari (@shivangisahu05) September 17, 2024
Me right now pic.twitter.com/Fjm6CogfMm
— Masoom bolte (@masoomgraphics) September 17, 2024
Also Read: OnePlus Nord Buds 3: బడ్జెట్ ధరలో కొత్త ANC బడ్స్ లాంచ్ చేసిన వన్ ప్లస్.!