Amazon Great indian Festival సేల్ నుంచి iPhone 13 ఊహించనంత తక్కువ ధరకు లభిస్తుందట.!
Amazon Great indian Festival సేల్ నుంచి iPhone 13 ఊహించనంత తక్కువ లభిస్తుందట
ఈ కొత్త అప్డేట్ మరియు ఆఫర్ లీక్ నెట్టింట్లో పెద్ద చర్చ నియాంశంగా మారింది
దనపు ఆఫర్స్ తో కలిపి మరింత తక్కువ ధరకు అందిస్తుందని చెబుతున్నారు
అమెజాన్ అప్ కమింగ్ బిగ్ సేల్ Amazon Great indian Festival సేల్ నుంచి iPhone 13 ఊహించనంత తక్కువ లభిస్తుందట. ఈ కొత్త అప్డేట్ మరియు ఆఫర్ లీక్ నెట్టింట్లో పెద్ద చర్చ నియాంశంగా మారింది. ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ నుండి కొత్త ఫోన్ లను ప్రకటించిన తర్వాత ఐఫోన్ 13 ఫోన్ లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఐఫోన్ 13 ల ధరలను కూడా భారీగా తగ్గించింది. అయితే, అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి అదనపు ఆఫర్స్ తో కలిపి మరింత తక్కువ ధరకు అందిస్తుందని చెబుతున్నారు.
SurveyAmazon Great indian Festival ఎప్పుడు మొదలవుతుంది?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ యొక్క డేట్ ను అమెజాన్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ సేల్ సెప్టెంబర్ 29 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని రూమర్లు ఉన్నాయి. కానీ, అమెజాన్ అఫీషియల్ గా ప్రకటించే వరకు ఈ డేట్ అంచనా డేట్ గానే పరిగణలోకి తీసుకోవాలి.
iPhone 13 డీల్ ఏమిటి?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ ఊహించనంత తక్కువ ధరకు లభిస్తుందట. ఈ మాట నేను అనడం లేదు ప్రముఖ లీక్ స్టర్స్ చెబుతున్నారు. ప్రముఖ లీక్ స్టర్ Dealz Trend అధికారిక X అకౌంట్ నుంచి అమెజాన్ సేల్ ఐఫోన్ 13 డీల్ పేరుతో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ఈ అకౌంట్ నుంచి షేర్ ఈ ట్వీట్ ప్రకారం, ఐఫోన్ 13 అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 38,999 ధరకే లభిస్తుంది చెబుతోంది.
iPhone 13 Price Revealed For Great Indian Festival Sale | Price ₹38,999.https://t.co/GbjUBnoCwL pic.twitter.com/uhwxkCSmmo
— DealzTrendz (@dealztrendz) September 15, 2024
అయితే, వాస్తవానికి ప్రస్తుతం ఐఫోన్ బేసి మోడల్ వేరియంట్ రూ. 49,900 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. అంటే, అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల డిస్కౌంట్ల అందితేనే ఈ పోస్ట్ చెప్పిన రేటు నిజం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, అమెజాన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఈ డీల్ లేదా రేటును రూమర్ గానే పరిగణలోకి తీసుకోవడం మంచిది.

త్వరలోనే అమెజాన్ యొక్క అతిపెద్ద పండుగ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: బిగ్ డీల్: 19 వేలకే బిగ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!