vivo Y200 Pro 5G: అతి సన్నని 3D Curved Display తో మే 21న వస్తున్న వివో కొత్త ఫోన్.!
ఇండియాలో వివో కొత్త ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
వివో Y200 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ ఫోన్ ను అతి సన్నని 3D Curved Display తో విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజింగ్
vivo Y200 Pro 5G: ఇండియాలో వివో కొత్త ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. రీసెంట్ గా vivo V30e స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వివో, ఇప్పుడు Y200 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను అతి సన్నని 3D Curved Display తో మే 21న విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది.
Surveyvivo Y200 Pro 5G: టీజింగ్
With two stunning colours and two crazy styles, the all new #vivoY200Pro #5G is in now! Launching on 21st May.
— vivo India (@Vivo_India) May 16, 2024
Stay Tuned! pic.twitter.com/FkwdgVrFwi
ఇప్పటికే వివో వై 200 సిరీస్ నుంచి రెండు ఫోన్లను అందించిన వివో, ఇదే సిరీస్ నుండి వై 200 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. వై 200 సిరీస్ నుంచి ఫ్లాట్ స్క్రీన్ ఫోన్ లు మాత్రమే కంపెనీ ఇప్పటి వరకూ అందించింది. అయితే, ఈ సిరీస్ నుండి యేసుకు వస్తున్న అప్ కమింగ్ ఫోన్ ను 3D కర్వ్డ్ డిస్ప్లేతో తీసుకువస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
vivo Y200 Pro 5G
వివో వై200 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లను వివో కన్ఫర్మ్ చేసింది. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ లేదా ఇతర వివరాలను మాత్రం ప్రస్తుతానికి ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ లలో రావచ్చని అర్ధం అవుతోంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుంది కంపెనీ కూడా తెలిపింది.

అంతేకాదు, ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా క్లియర్ అయ్యింది. టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో చాలా సన్నని డిజైన్ మరియు బాగా వంపు కలిగిన డిస్ప్లే ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: Fastrack Xtreme Pro: AMOLED డిస్ప్లే మరియు రగ్డ్ డిజైన్ తో కొత్త Smart Watch లాంచ్.!
అయితే, నెట్టింట్లో ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెక్స్ ను అంచనా వేసి చెబుతున్నారు. వివో ఈ ఫోన్ ను Snapdragon 695 5G ప్రోసెసర్ మరియు 64MP ప్రధాన కెమెరా ఉన్నట్లు అంచనా వేసి చెబుతున్నారు. అయితే, కంపెనీ నుంచి ఈ ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు. అయితే, లాంచ్ నాటికి ఈ ఫోన్ యొక్క వివరాలు అందించే అవకాశం ఉంటుంది.