Google Photos కోసం New AI ఫీచర్ తీసుకు వచ్చిన గూగుల్ | Tech News

HIGHLIGHTS

కొత్త ఫీచర్స్ ను Google Photos కి యాడ్ చేస్తోంది

ఫోటోలను సక్రమమైన పద్దతిలో సర్దిపెట్టె New AI ఫీచర్ తెస్తోంది

ఫోటోలను సరైనపద్ధతిలో షార్ట్ చేసి సక్రమంగా పెట్టడానికి AI ని ఉపయోగిస్తుంది

Google Photos కోసం New AI ఫీచర్ తీసుకు వచ్చిన గూగుల్ | Tech News

గూగుల్ చాలా వేగంగా కొత్త ఫీచర్స్ ను గూగుల్ ఫోటోస్ కి యాడ్ చేస్తోంది. ఇటివల, ఫోటోలను అందంగా మార్చడానికి వీలుగా గూగుల్ ఫోటోస్ లోని మ్యాజిక్ ఎడిటర్ లో కొత్త AI Editing ఫీచర్ నీ తీసుకు వచ్చింది గూగుల్. అయితే, ఇప్పుడు మరొక స్టెప్ ముందుకు వేసి యూజర్ యొక్క ఫోటో లైబ్రరీలో చిందర వందరగా పడివున్న ఫోటోలను సక్రమమైన పద్దతిలో సర్దిపెట్టె ఫీచర్ తెస్తోంది. ఈ విధంగా ఫోటోలను సరైనపద్ధతిలో షార్ట్ చేసి సక్రమంగా పెట్టడానికి AI ని ఉపయోగిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

New AI Features on Google Photos

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైన పెరుగున్న అవగాహన మరియు వాడకంతో అన్ని పనులకు ఎఐ ను ఉపయోగిస్తున్నారు. ఇదే దారిలో యూజర్లకు వారి ఫోటోలను సక్రమంగా ఉంచేందుకు వీలుగా గూగుల్ ఫోటోస్ లో కొత్త ఎఐ ఫీచర్ ను తెస్తోంది గూగుల్. ఈ ఫీచర్ ఆటొమ్యాటిగా యూజర్ల ఫోటోలను షార్ట్ చేసి ఆప్టిమైజ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూజర్ లైబ్రరీలో ఒకేవిధంగా ఉన్న ఫోటోలను క్లబ్ చేసి వాటిని ఒకే వరుసలో ఉంచుతుంది.

New AI Features on Google Photos
ఇమేజ్ క్రెడిట్ గూగుల్

ఈ చర్య ద్వారా యూజర్ గూగుల్ ఫోటోస్ లైబ్రరీలో చిందర వందర తగ్గిపోతుంది. అంతేకాదు, దీనికోసం యూజర్ కు ఎటువంటి సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా కూడా ఉండదు. ఎందుకంటే, గూగుల్ ఫోటోస్ కోసం గూగుల్ తెచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటొమ్యాటిగ్గా ఈ పనులను చేసేస్తుంది.

Also Read : itel S23+ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..OTA అప్డేట్ తో ఐఫోన్ లాంటి ఫీచర్.!

డాక్యుమెంట్స్ కోసం కొత్త సెక్షన్

ఈ కొత్త ఫీచర్ ద్వారా స్క్రీన్ షాట్స్ మరియు డాక్యుమెంట్స్ కోసం కొత్త ‘డాక్యుమెంట్స్’ సెక్షన్ కూడా క్రియేట్ చేయబడుతుంది. దీని ద్వారా చాలా సులభంగా డాక్యుమెంట్స్ మరియు స్క్రీన్ షాట్ గుర్తింవచ్చు.

గూగుల్ ఫోటోస్ యాప్ నుండే రిమైండర్స్

ఈ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ద్వారా మీరు ఇప్పుడు గూగుల్ ఫోటోస్ యాప్ నుండే రిమైండర్స్ ను నేరుగా సెట్ చేసుకోవచ్చు. డేటా లేదా టెక్స్ట్ కలిగిన ఫోటోలను మరియు క్యాలెండర్ ను సింక్ చేయడం ద్వారా రిమైండర్స్ ను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, టాప్ పిక్ ఫోటోలను సైతం గూగుల్ ఫోటోస్ ఎఐ ఆటొమ్యాటిగ్గా సజస్ట్ చేస్తుంది. మీరు మాన్యువల్ గా కావాలన్నా చేసుకునే వీలుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo