itel S23+ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..OTA అప్డేట్ తో ఐఫోన్ లాంటి ఫీచర్.!

HIGHLIGHTS

కేవలం 13 వేల ధరలో కర్వ్డ్ డిస్ప్లేతో itel S23+ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన ఐటెల్

డైనమిక్ ఐస్ ల్యాండ్ ఫీచర్ మాదిరి ఫీచర్ ను ఇందులో జత చేస్తోంది

ఈ ఫోన్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ తో మరింత ఆకట్టుకుంటుంది

itel S23+ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..OTA అప్డేట్ తో ఐఫోన్ లాంటి ఫీచర్.!

కేవలం 13 వేల ధరలో కర్వ్డ్ డిస్ప్లేతో itel S23+ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన ఐటెల్ ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ తెలిపింది తెలిపింది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసుకొని తీసుకు వచ్చిన ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ లో OTA అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్ అందిస్తోంది. ఐఫోన్ ప్రీమియం ఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 15 లో అందించిన డైనమిక్ ఐస్ ల్యాండ్ ఫీచర్ మాదిరి ఫీచర్ ను ఇందులో జత చేస్తోంది. ఈ ఫోన్ చవక ధరలో వచ్చే కర్వ్డ్ ఫోన్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ తో మరింత ఆకట్టుకుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

itel S23+ OTA Update

ఐటెల్ ఎస్23+ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో రూ. 13,999 ధరకే లభిస్తుంది. ఈ ధర సెగ్మెంట్ లో 3D Curved AMOLED డిస్ప్లే కలిగిన ఏకైక ఫోన్ గా కూడా కొనియాడబడుతుంది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ పైన అందించిన కొత్త ఓటిఏ అప్డేట్ తో మరింతా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొత్త అప్డేట్ తో ఈ ఫోన్ లో ఐఫోన్ ప్రీమియం లలో కనిపించే డైనమిక్ ఐస్ ల్యాండ్ మాదిరిగా నోటిఫికేషన్ బార్ సెల్ఫీ కెమేరా చుట్టూ కనిపిస్తుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ మరింత ప్రీమియం ఫోన్ లాగా కనిపిస్తుంది.

Also Read : YouTube: ప్రీమియం యూజర్ల కోసం AI Chatbot తెచ్చే పనిలో యూట్యూబ్

ఐటెల్ ఎస్23+ ప్రత్యేకతలు

ఐటెల్ ఎస్23+ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ప్రత్యేకతలతో వస్తుంది. ఈ ఫోన్ 6.78 FHD+ 3D AMOLED డిస్ప్లేని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు Gorilla Glass 5 ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8GB RAM + 256 GB భారీ స్టోరేజ్ తో కూడా వస్తుంది.

itel S23+ OTA Update
ఐటెల్ ఎస్23+ ప్రత్యేకతలు

ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ కెమేరా మరియు 32MP సెల్ఫీ కెమేరాలతో వస్తుంది. ఇందులో Chat GPT అసిస్టెంట్ ను కూడా కంపెనీ అందించింది. అంతేకాదు, ఈ ఐటెల్ ఫోన్ 2 సంవత్సరాల వారెంటీతో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile