ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ భాచాత్ ఢమాల్ సేల్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుండి స్టార్ట్ చేసింది. ఈ సేల్ మే 19 నుండి మే 21 వరకూ యూజర్లకు అంధుబౌట్లో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ బిగ్ సేల్ నుండి ఈరోజు Xiaomi స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్స్ ను కూడా ప్రకటించింది. షియోమి బిగ్ స్మార్ట్ టీవీ ని బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు బిగ్ భాచాత్ ఢమాల్ సేల్ నుండి మీకు అందుబాటులో వుంది.
Survey
✅ Thank you for completing the survey!
బిగ్ భాచాత్ ఢమాల్ సేల్ నుండి ఈరోజు Mi X Series యొక్క 50 ఇంచ్ Ultra HD (4K) స్మార్ట్ టీవీ 26% డిస్కౌంట్ తో రూ. 32,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ టీవీ ని HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఫుల్ పేమెంట్ చేసే వారు రూ. 1,500 మరియు కార్డ్స్ తో EMI అఫర్ తో కొనే వారు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే, ఈ టీవీ ని మరింత తక్కువ ధరకే అందుకోవచ్చు.
షిమోమి యొక్క ఈ 50 ఇంచ్ Ultra HD (4K) స్మార్ట్ టీవీ HDR 10,HLG లతో పాటుగా Dolby Vison సపోర్ట్ తో వస్తుంది మరియు ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ ను కలిగి వుంది. ఈ టీవీ లో 3HDMI మరియు 2USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ కూడా ఉంది.
ఈ Mi X సిరీస్ 50 ఇంచ్ టీవిలో 30W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు, Dolby Audio మరియు Dts Virtual X, Dts-HD సౌండ్ సపోర్ట్ కూడా వుంది.