Google లేదా Gmail అకౌంట్ పాస్ వర్డ్ తిరిగి పొందడం ఎలా?

HIGHLIGHTS

Gmail మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారింది

మీ ఆఫీస్ పని నుండి మొదలుకొని మీ వ్యక్తిగత జీవితంలో ఇమెయిల్ సర్వీస్ వరకూ అన్ని విషయాలకు Gmail ఉపయోగించబడుతుంది.

Google యొక్క ఇతర సేవలను ఉపయోగించడానికి కూడా మీకు ఇదే Gmail ఖాతా అవసరం.

Google లేదా Gmail అకౌంట్ పాస్ వర్డ్ తిరిగి పొందడం ఎలా?

Gmail మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారింది. మీ ఆఫీస్ పని నుండి మొదలుకొని మీ వ్యక్తిగత జీవితంలో ఇమెయిల్ సర్వీస్ వరకూ అన్ని విషయాలకు ఇది ఉపయోగించబడుతుంది. Google యొక్క ఇతర సేవలను ఉపయోగించడానికి కూడా మీకు ఇదే Gmail ఖాతా అవసరం. అదనంగా, మీరు Android ఫోన్‌ ను ఉపయోగిస్తే, ఈ ఖాతా తప్పనిసరి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కాబట్టి Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే, మీరు దాన్ని క్రింది పద్దతి ద్వారా తిరిగి పొందగలుగుతారు. దీని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం …

మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఎలా కోలుకోవాలి?

Step 1 – మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.

Step 2 – ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.

Step 3 – మీకు గుర్తుంకువున్న చివరి పాస్‌ వర్డ్ ‌ను నమోదు చేయండి. మీకు పాస్ ‌వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.

Step 4 – మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ‌కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

Step 5 – మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ ‌కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.

Step 6 – ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.

Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.

Step 8 – రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ ‌వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.

గమనిక: పాస్‌ వర్డ్ ‌ను చీటికిమాటికి మార్చవద్దు మరియు దానిని వ్రాసుకోండి. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌ టాప్ ‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు మీ బ్రౌజర్‌లో బ్రౌజర్ సేవ్ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయవచ్చు. అయితే, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌ టాప్ ‌ను ఇంకెవ్వరూ ఉపయోగించే  నిర్ధారించుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo