ఒకే IMEI నంబర్ తో 13,500 VIVO స్మార్ట్ ఫోన్ల చాలామణీ

HIGHLIGHTS

భారతదేశంలో 13,500 కి పైగా స్మార్ట్ ‌ఫోన్లు ఒకే IMEI నంబర్లతో ఉపయోగించబడుతున్నాయని కనుగొన్నారు.

ఈ Smart Phones ని ట్రాక్ చేయడం మరింత కష్టతరం అని కూడా తెలుస్తోంది.

ఈ స్మార్ట్ ‌ఫోన్లు చైనా హ్యాండ్‌సెట్ తయారీదారు VIVO కు చెందినవిగా గుర్తించబడ్డాయి.

ఒకే IMEI నంబర్ తో 13,500 VIVO స్మార్ట్ ఫోన్ల చాలామణీ

దొంగిలించబడిన ఫోన్లకు నెట్‌వర్క్ యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి మరియు అధికారికంగా చెల్లుబాటు అయ్యే మరియు ప్రామాణికమైన మొబైల్ ఫోన్లను గుర్తించడానికి నెట్‌వర్క్‌లు IMEI నంబర్ పైన ఆధారపడతాయి. అయితే, మీరట్‌లోని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భారతదేశంలో 13,500 కి పైగా స్మార్ట్ ‌ఫోన్లు ఒకే IMEI నంబర్లతో ఉపయోగించబడుతున్నాయని కనుగొన్నారు. అంతేకాదు, వీటిని ట్రాక్ చేయడం మరింత కష్టతరం అని కూడా తెలుస్తోంది. వాస్తవానికి, IMEI నంబర్‌ ను టాంపరింగ్ చెయ్యడం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. దీనికి పాల్పడిన నేరస్థులకు, 3 సంవత్సరాల వరకూ జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానాతో శిక్షించడం లేదా కొన్నిసార్లు ఈ రెండూ శిక్షలను కలిపి విధించడం జరుగుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరట్ పోలీసులతో నేరుగా మాట్లాడిన LiveMint న్యూస్ ప్రకారం, ఈ స్మార్ట్ ‌ఫోన్లు చైనా హ్యాండ్‌సెట్ తయారీదారు వివోకు చెందినవిగా గుర్తించబడ్డాయి. అందుకే, ఈ సంస్థ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియాలోని మొదటి ఐదు ప్రధాన స్మార్ట్ ‌ఫోన్ తయారీదారులలో VIVO ఒకటి.

ముందుగా PTI రిపోర్ట్ చేసిన ప్రకారం, పోలీసులు ఈ అంశంపై ఐదు నెలలుగా సుదీర్ఘ దర్యాప్తు చేస్తున్నారు. మరమ్మతులు చేసిన తర్వాత ఫోన్ సరిగా పనిచేయకపోవడంతో, సైబర్ క్రైమ్ సెల్‌లోని పోలీసు సిబ్బంది తన ఫోన్‌ను సిబ్బందికి ఇచ్చినప్పుడు ఈ విషయం మొదట కనుగొనబడింది.

ఈ దర్యాప్తులో, సైబర్ సెల్ 13,500 కంటే ఎక్కువ ఇతర మొబైల్ ఫోన్లు ఒకే IMEI నంబర్‌ తో ఉపయోగిస్తున్నట్లు గుర్తించాయి. ఇది తీవ్రమైన భద్రతా సమస్యకు దారితీసింది.

"Prima facie, ఇది మొబైల్ ఫోన్ కంపెనీ యొక్క పెద్ద నిర్లక్ష్యం అనిపిస్తుంది మరియు నేరస్థులు దీనిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు" అని మీరట్ ఎస్పీ (సిటీ) అఖిలేష్ ఎన్ సింగ్ అన్నారు.

Vivo సంస్థ పైన భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 420 కింద కేసు నమోదైందని మింట్ నివేదిక హైలైట్ చేసింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo