Samsung గెలాక్సీ A51 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

HIGHLIGHTS

గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది.

Samsung గెలాక్సీ A51 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

శామ్సంగ్ సంస్థ, నిన్న ఇండియాలో తన సరికొత్త గెలాక్సీ A51 స్మార్ట్ ఫోన్ను ఒక 48MP కెమెరా మరియు గొప్ప డిజైన్ తో గెలాక్సీ A51 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కాకుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. డిసెంబర్ 31 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. ఈ గెలాక్సీ A51 ఒక 6.5 అంగుళాల FHD + SuperAMOLED డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు అత్యధికమైన బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు.

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు DCI-P3 కలర్ స్పేస్ కలిగిన సూపర్ AMOLED  డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ ఫోన్ హైరిజల్యూషన్ లో  వీడియోలను చూసే వీలునూకల్పిస్తుంది.  

3. ఈ గెలాక్సీ A51  వెనుకభాగంలో  48MP + 12MP + 5MP + 5MP  క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులోని 48MP ప్రధాన సెన్సార్ ఒక f /1.8 అపర్చరుతో వస్తుంది. ఇక ఇందులోని 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 5MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఇక చివరిగా మిగిన 5MP మ్యాక్రో కెమేరా కూడా దగ్గరి ఫోటోలను చక్కగా తీయ్యడానికి ఉపయోగపడుతుంది.

4. ముందుభాగంలో ఒక గొప్ప 32MP ఇన్ఫినిటీ -O  సెల్ఫీ కెమేరాతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.  

5.  ఈ ఫోన్ ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక వేగవంతమైన 15W  ఛార్జ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టెక్నాలజీతో ఈ ఫోన్ను చాలా వేగంగా ఛార్జ్  చేసుకోవచ్చు .

6. ఈ గెలాక్సీ A51 ఒక Exynos 9611 ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఇది గరిష్టంగా 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. అలాగే, స్పీడుగా పనిచేయగల LPDDR4X RAM తో వస్తుంది. ఇది 10nm సాంకేతికతతో వస్తుంది మరియు జతగా 6GB లేదా 8GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా, ఈ రెండు వేరియంట్లతో  128GB ఇంటర్నల్ స్టోరేజిని అఫర్ చేస్తోంది.

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో కోత్త తరం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా తీసుకువస్తుంది. 

8.  ఈ ఫోన్, కేవలం 7.9MM మందంతో సన్నగా మరియు బ్లాక్,  బ్లూ మరియు వైట్  వైట్ వంటి మూడు రంగులలో లభిస్తుంది మరియు మంచి డిజైనుతో ఆకట్టుకుంటుంది.        

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది ప్రస్తుత తరానికి స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది.

10. గెలాక్సీ A51 యొక్క ధరలు    

1. గెలాక్సీ A51 –  6GB RAM + 128 GB స్టోరేజి ధర – 23,999

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo