2020 లో అధికారికంగా ధర తగ్గించబడిన షావోమి మరియు రియల్మీ యొక్క టాప్ 5 స్మార్ట్ ఫోన్లు

HIGHLIGHTS

టాప్ 5 స్మార్ట్ ఫోన్లను గురించిన వివరాలను చూడబోతున్నాము.

2020 లో అధికారికంగా ధర తగ్గించబడిన షావోమి మరియు రియల్మీ యొక్క టాప్ 5 స్మార్ట్ ఫోన్లు

రోజురోజుకు మారుతున్న మరియు పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగానికి తగినట్లుగా అన్ని ప్రధాన మొబైల్ తయారీ కంపెనీలు కూడా సరికొత్త స్మార్ట్ ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. అయితే, కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రం తమ స్పెక్స్ మరియు ధర కారణంగా, వినియోగదారుల ఎంపికలో ప్రధమంగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా, బడ్జెట్ వినియోగదారుల మనసు గెలుచుకున్న ఫోన్, ఇండియాలో అత్యధికమైన అమ్మకాలను కొనసాగిస్తున్నాయి మరియు ఈ సెగ్మెంట్ లో ఎక్కువగా షావోమి మరియు రియల్మీ వంటి మరిన్ని ప్రధాన సంస్థలు తమ హావా కొనసాగిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, ఈరోజు మనం ఇటీవల కాలంలో మార్కెట్లో అందరి మన్నలను అందుకొని మంచి అమ్మకాలను సాధించి ప్రస్తుతం ధర తగ్గించబడి చౌక ధరతో అమ్ముడవుతున్న, షావోమి మరియు రియల్మీ బ్రాండ్స్ యొక్క టాప్ 5 స్మార్ట్ ఫోన్లను గురించిన వివరాలను చూడబోతున్నాము. 

షావోమి ధర తగ్గించిన టాప్ – 3 స్మార్ట్ ఫోన్లు

1. Redmi Note 7 Pro 

ఇండియాలో ఒక 48MP SonyIMX586 సెన్సారుతో మరియు వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ తో పాటుగా ముందు మరియు వెనుక ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణతో అందమైన మరియు స్ట్రాంగ్ బాడీతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్, తన మొదటి సేల్ నుండి మొదలుకొని దాదాపుగా 6 నెలలు పీక్ స్థాయిలో అమ్మకాలను సాధించింది. ఈ ఫోన్ విడుదల సమయంలో రూ.13,999 రూపాయల ధరతో విడుదలయ్యుంది. అయితే, షావోమి ప్రస్తుతం ఈ ఫోన్ను కేవలం రూ. 9,999 రూపాయల ధరతో అమ్ముడు చేస్తోంది.

2. Mi A3

షావోమి ఇండియాలో తన మూడవ ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ఫోనుగా ఈ Mi A3 స్మార్ట్ ఫోన్ను అద్భుతమైన ప్రత్యేకతలతో విడుదల చేసింది. ఇది విడుదలైన వెంటనే మంచి అమ్మకాలను కొనసాగించింది.  దీన్ని కేవలం రూ. 12,999 రూపాయల ప్రారంభం ధరతో ప్రకటించడమే ఇందుకు కారణం అని కూడా చెప్పొచ్చు. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ కూడా 1000 రూపాయల ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో అతితక్కువ ధరలో అందుబాటులోవున్న 48MP ట్రిపుల్ కెమేరా, అదీకూడా Android One స్మార్ట్ ఫోన్ కేవలం Mi A3 మాత్రమే అవుతుంది.

3. Redmi Note 7s 

షావోమి, ఈ రెడ్మి నోట్ 7s ను బడ్జెట్ వినియోగదారులను  టార్గెట్ చేసుకొని ఒక 48MP డ్యూయల్ కెమెరాలో కేవలం 10,999 రూపాయల ధరలో తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా, వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో పాటుగా ముందు మరియు వెనుక ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణతో అందమైన మరియు స్ట్రాంగ్ బాడీతో వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ కేవలం రూ. 8,999 ధరతో అమ్ముడవుతోంది. అంటే, 2000 రూపాయల ధరను షావోమి ఈ ఫోన్ పైన తగ్గించింది.

Realme ధర తగ్గించిన టాప్ -2 స్మార్ట్ ఫోన్లు   

1. Realme 3 Pro

 ఈ Realme 3 Pro స్మార్ట్ ఫోన్, కెమేరా మరియు ప్రాసెసర్ పరంగా గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు.  ఇందులో అందించిన  16MP + 5MP డ్యూయల్ రియర్ కెమేరా ఒక 8 షాట్లను కలిపి ఒక 64MP అల్ట్రా HD ఫోటోగా అందించే ఫీచరుతో వస్తుంది. అంతేకాకుండా, ఇందులోని క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరు మరియు 4GB, 6GB ర్యామ్లతో జతగా వస్తుంది కాబట్టి, ఈ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు, ఇది అత్యంత వేగవంతంగా ఈ ఫోన్ను ఛార్జ్ చేస్తుంది. ప్రస్తుతం, కేవలం 10,000 ధరలో PUBG గేమ్ కోసం ఒక మంచి ఫోన్ కోసం చూసే వారికీ ఇది మోహెచ్డీటి ఎంపిక గా ఉండవచ్చు. ముందుగా, రూ.13,999 ధరతో వచ్చిన ఈ ఫోన్ను, ప్రస్తుతం రియల్మీ కేవలం రూ.9,999 ధరతో అమ్మడుచేస్తోంది.

2. Realme 5 Pro

రియల్మీ తన 5 సిరీస్ తో బడ్జెట్ వినియోగదారులను కెమేరా విభాగంలో మరింత ఎక్కువ ఫీచర్లను అందుకునేలా చేసిందని చెప్పొచ్చు. అందులోనూ, రియల్మీ 5 ప్రో లో  ఇచ్చిన 48MP SonyIMX 586 సెన్సార్ క్వాడ్ కెమేరా సెటప్ గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాదు, ఇందులోని క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ ప్రొసెసరు మరియు 4GB, 6GB మరియు 8GB ర్యామ్ల తో జతగా వస్తుంది కాబట్టి, ఈ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. దీని పైన కూడా 1000 రుపాయల ధర తగ్గించి కేవలం రూ.12,999 ధరకే అమ్ముడు చేస్తోంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo